Saturday, January 4, 2025
HomeSportsRCB vs DC| ఢిల్లీపై సూప‌ర్ విక్ట‌రీ సాధించిన బెంగ‌ళూరు.. ప్లే ఆఫ్స్‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌గా..!

RCB vs DC| ఢిల్లీపై సూప‌ర్ విక్ట‌రీ సాధించిన బెంగ‌ళూరు.. ప్లే ఆఫ్స్‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌గా..!

RCB vs DC| నిల‌వాలంటే గెలవాల్స‌న ప‌రిస్థితుల‌లో బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఐపీఎల్ సీజ‌న్ 17 ప్రారంభంలో చెత్త ఆట‌తో వ‌రుస పరాజాయాలు చ‌విచూసిన ఈ జ‌ట్టు ఇప్పుడు మాత్రం వరుస విజ‌యాల‌తో రేసులో దూసుకుపోతుంది. సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో బెంగళూరు అద్భుతమైన విజయాన్ని అందుకోవ‌డంతో ఆర్సీబీకి ప్లేఆఫ్ అవ‌కాశాలు మ‌రింత మెరుగ‌య్యాయి. మే 18న చెన్నై, ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుండ‌గా, ఆ మ్యాచ్‌తో ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది అనే దానిపై క్లారిటీ రానుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది

ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్స్ విరాట్ కోహ్లీ (27) , కెప్టెన్ డు ప్లెసిస్ (6) పెద్ద‌గా ప‌రుగులు రాబ‌ట్ట‌లేక‌పోయారు. మ‌రోసారి రజత్ పాటిదార్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో వీర‌విహారం చేయ‌గా, ఆ త‌ర్వాత విల్ జాక్స్ (41), కామెరాన్ గ్రీన్ (32) మోస్త‌రు ప‌రుగులు సాధించారు. మహిపాల్ లోమ్రోర్ (13), కరణ్ శర్మ (6) పరుగులు మాత్ర‌మే చేశారు. ఈ క్ర‌మంలో ఆర్సీబీ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 187 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రాసిఖ్ సలామ్ తలో 2 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇక 188 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ జ‌ట్టు 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. రిష‌బ్ స్థానంలో కెప్టెన్సీ చేప‌ట్టిన అక్షర్ పటేల్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) త‌ప్ప ఏ బ్యాట్స్‌మెన్ రాణించ‌క‌పోవ‌డంతో ఢిల్లీ ప‌రాజ‌యం పాల‌యింది. షైహోప్(23 బంతుల్లో 4 ఫోర్లతో 29) కాస్త పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు. ఈ ఓట‌మితో ఢిల్లీకి ప్లే ఆఫ్ అవ‌కాశాలు కాస్త స‌న్నగిల్లాయి. ఇక బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన కెమెరాన్ గ్రీన్ (32, 1/19)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు