Monday, December 30, 2024
HomeCinemaRenu Desai|ఏంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ అంత పెద్ద త్యాగం చేసిందా?

Renu Desai|ఏంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ అంత పెద్ద త్యాగం చేసిందా?

Renu Desai| బ‌ద్రి సినిమాతో ఒక్క‌టైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ జంట కొన్నేళ్ల‌పాటు డేటింగ్ చేసి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ప‌వ‌న్, రేణూ దేశాయ్ విడిపోయారు. ఎవ‌రి దారులు వారు చూసుకున్నారు. ప‌వ‌న్ మూడో పెళ్లి చేసుకోగా, రేణూ దేశాయ్ మ‌ళ్లీ పెళ్లి జోలికి పోకుండా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ని చూసుకుంటూ జీవితం సాగిస్తుంది. కొన్నాళ్లుగా బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ పిల్లల మీదే తన ఫోకస్ పెట్టేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఆ మ‌ధ్య టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే చిత్రంలో చిన్న పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది. ఇక త‌న కుమారుడు అకిరా సినీ ఎంట్రీ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే తానే ముందుగా ప్రకటిస్తానని అంటుంది రేణూ దేశాయ్ .

అయితే రేణూ దేశాయ్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఆమె ప‌వన్ క‌ళ్యాణ్ కోసం పెద్ద త్యాగం చేసింద‌ని అంటున్నారు. 2000 సంవ‌త్స‌రంలో బ‌ద్రి సినిమాతో కెరియ‌ర్‌ని మొద‌లు పెట్టింది రేణూ దేశాయ్. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌తో ప్రేమలో ప‌డ‌డం ఆ త‌ర్వాత ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండ‌డం జ‌రిగింది. ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ఉండ‌డం వ‌ల్ల‌నే రేణూ పెద్దగా సినిమాలు చేయ‌లేదు. బ‌ద్రి త‌ర్వాత మ‌ళ్లీ పవర్ స్టార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా కోసం మాత్రమే ఆమె మేకప్ వేసుకుంది. అయితే ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ప‌డ‌క‌పోయి ఉంటే రేణూ దేశాయ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేద‌ని అంటున్నారు. బద్రి చిత్రం త‌ర్వాత చాలా మంది నిర్మాత‌లు ఆమె వెన‌క చెక్కులు ప‌ట్టుకొని తిరిగార‌ట‌.

పవ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆమెను నటించమని ప్రోత్సహించిన కూడా రేణూ అటువైపు ఆస‌క్తి చూప‌లేదట‌. రేణూ దేశాయ్‌కి మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రలో నటించే అవకాశం రాగా, దానిని కూడా వ‌దిలేసుకుంది. స్క్రిప్ట్ న‌చ్చిన కూడా ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ఉన్న కార‌ణంగా రేణూ దేశాయ్ మురారి చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని వ‌దిలేసుకుంది. ప‌వ‌న్ త‌ప్ప త‌న‌కు మ‌రో ఆలోచ‌న లేకుండా ఉండాల‌ని రేణూ భావించింద‌ట‌. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియదు కాని వారు ఊహించని విధంగా విడిపోయి అందరిని బాధ‌పెట్టారు

RELATED ARTICLES

తాజా వార్తలు