Renu Desai| మల్టీ టాలెంటెడ్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితమైన రేణూ దేశాయ్ సుమారు రెండు దశాబ్దాల తర్వాత టైగర్ నాగేశ్వర రావు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఇంట్రీ ఇచ్చింది. చిత్రంలో ఆమె హేమలతా లవణం పాత్రలో కనిపించి సందడి చేసింది.అయితే ఈ సినిమా తర్వాత రేణూ మళ్లీ ఎలాంటి ప్రాజెక్ట్‌కి సైన్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులని పలకరిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే కొద్ది రోజులుగా రేణూ దేశాయ్ నుండి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఏమైందా అని అనుకుంటున్న సమయంలో ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో రూ. 3500 కావాలని కోరుతూ ఓ మెసేజ్ ప్రత్యక్షం అయింది. అంతేకాకుండా అందులో క్యూ ఆర్ కోడ్ కూడా ఉండడంతో అందరు షాక్ అయ్యారు.
రేణూ దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని, అందుకే అలా డబ్బులు కావాలనే మెసేజ్ ప్రత్యక్షం అయిందని చాలా మంది నెటిజన్స్ భావించారు. ఆ సమయంలో రేణూ దేశాయ్ తన అకౌంట్ హ్యాక్ కాలేదని, తానే డబ్బులు అడిగినట్టు తెలియజేసింది.ఫుడ్ పాయిజన్ కారణంగా కొద్ది రోజులుగా తాను వీడియో చేయలేకపోయానని స్పష్టం చేసింది. అయితే తనకు కేవలం రూ. 3500 విరాళం అవసరం ఏమొచ్చిందనే అనుమానం అందరికి రావొచ్చు. కారణం ఏంటంటే.. నేను అప్పుడప్పుడు కొంత డొనేట్ చేస్తూ ఉంటాను. నా సంపాదనలో కొంత భాగాన్ని డొనేట్ చేస్తూ వస్తున్న నేను మరి కొంత భాగాన్ని నా పిల్లల కోసం దాచుకోవాలి.
నాకు డొనేట్ చేసేందుకు ఎక్కువ అవసరం పడుతుంది. నా వరకు సాయం చేశాక.. ఇంకా బ్యాలెన్స్ కోసం ఫాలోవర్స్‌ను అడుగుతున్నాను..చిన్న పిల్లల కోసం, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం తన సంపాదనలో కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తుంటాను. ఇప్పుడు ఆవుల కోసం ఓ షెడ్డుని నిర్మిస్తున్నాను. ఏడాదిన్నర లోగా ఆ షెడ్డు నిర్మాణం పూర్తవుతుందని రేణూ చెప్పుకొచ్చింది. అయితే నేను అడిడిన వెంటనే నా పట్ల ప్రేమ, కేర్ చూపించి 5 నిమిషాల్లోనే మానవత్వంతో డబ్బులు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రేణూ తన పోస్ట్‌లో తెలియజేసింది.