- ఢిల్లీ వేధికగా వార్
- వారం రోజులుగా ఢిల్లీలోనే ఉత్తమ్
- రేవంత్ పై ఫిర్యాదుల పరంపర
- హుటాహుటిన హస్తినకు రేవంత్
- నా కేబినేట్ నా ఇష్టమంటున్న సిఎం
కాంగ్రెస్ పార్టీలో మంత్రి వర్గ విస్తరణ చిచ్చు రాజేస్తోంది. ఢిల్లీ వేధికగా అసమ్మతి స్వరం ప్రతిధ్వనిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు అంతర్గతంగానే కొనసాగిన కలహాల లావా పగిలి బద్దలవుతున్నది ఢిల్లీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ఎంఎల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ను ఆసరగా చేసుకున్న అసంతప్త మంత్రులంతా ఒక్కటై మంత్రి ఉత్తమ్ ను టీం లీడర్ గా చేసి ఫిర్యాదులు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినేట్ లో ఉన్నా లేకపోయినా సిఎం రేవంత్ దూకుడు కళ్లెం వేయాలని బావిస్తోన్న మంత్రి ఉత్తమ్ గతంలో ఎన్నడు లేని విధంగా వారం పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి అసంతృప్త వ్యూహ రచనను రక్తి కట్టించారు. దెబ్బకు అదిష్టానం రంగంలోకి దిగి ఏం జరుగుతుదంటూ సిఎంరేవంత్ ను హుటాహుటిన బుధవారం ఢిల్లికి పయనమయ్యారు. సాయంత్రం పార్టీ ముఖ్యులతో భేటీ అయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇంతకు కేబినేట్ విస్తరణ ఉంటుందా…ఉండదా….ఉంటే ఎవరెవరుంటారు… ఏ వర్గం నుండి ఎవరికి అవకాశం లభిస్తుందన్న చర్చ హీట్ హాట్ గా సాగుతుండడం విశేషం.
గుర్రుగా ఉత్తమ్…ఫిర్యాదులివే
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉండడమే గాక అదిష్టానానికి ఈ సారి గట్టిగానే ఫిర్యాదులిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిఎంగా అవకాశం లభించినా రేవంత్ సీనియర్లను కలుపుకుపోవడం లేదని వాదన. ప్రభుత్వంలో జరిగే ఏ నిర్ణయాల్లో కూడా సీనియర్లను భాగస్వామ్యులను చేయకపోవడంతో పాటు అవమాన పరుస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఐఏఎస్, ఐపిఎస్ బదిలీలతో పాటు ఉన్నతాధికారుల బదిలీల విశయంలో జిల్లా మంత్రులను, ఎమ్మెల్యేలను సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఇక పాత కొత్త కాంగ్రెస్ వేర్వేరుగా అన్నట్టు లాబీయింగ్ చేస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వద్దన్నా ఎందుకు చేర్చుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక మలి విడత మంత్రి వర్గ విస్తరణలో సీనియర్లకు గాకుండా తమకు నచ్చిన వారికే అవకాశం ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని మరో ఫిర్యాదులో పేర్కొన్నారట. రేవంత్ కు రాష్ట్రంలో సొంత బలం లేదని…ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పట్టుబట్టి ఇప్పించుకున్న సీట్లలో కాంగ్రెస్ ఓటమి చెందిందని పాలమూరు సహా ఓటమి పాలైన 8 సీట్లలో ఉదహరణలతో సహా వివరించినట్టు తెలుస్తోంది.
ఏందీ రపరప…: రేవంత్
పాలనలో పంటికింద రాయిలా సీనియర్ల రూపంలో మంత్రి ఉత్తమ్ రెడ్డి చేస్తున్న అధిష్టానంకు చేసిన ఫిర్యాదులపై సిఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. ప్రతీసారి ఢిల్లీ వెళ్లి ఏదో ఒకటి చెప్పడం, అదిష్టానం తరుచూ ఢిల్లీకి రమ్మనడం పట్ల తప్పుడు సంకేతాలు వెల్తున్నాయని రేవంత్ శిబిరం అంటోంది. అందుకే ఈ సారి అదిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు కూడా సిఎం రేవంత్ రెడ్డి సిద్దమైనట్టు కూడా ఓ ప్రచారం జరుగుతోంది. మొదట్నుంచి బిఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంతో కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలున్నారని ఇప్పటికే రేవంత్ అదిష్టానానికి ఆదారాలతో సహా ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే కెబినేట్ విస్తరణ నేఫద్యంలో అడ్డుపుల్లలేయడం ఏంటిన చెబుతున్నారు. విస్తరణ కోసం ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తో సిఎం రేవంత్ భేటీ అయ్యారు. 4వ తేదీ సాయంత్రం గాని 5వ తేదీ మద్యాహ్నం లోపు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం కోసం సమయం ఇవ్వాలని కూడా కోరారు. ఈ లోగా మళ్లీ ఢిల్లీ పిలుపు రావడంతో సిఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అదిష్టానం వద్ద మంత్రి వర్గ విస్తరణ విషయంలో తుదిసారి చర్చలు జరిపి 5 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించాలని సిఎం రేవంత్ పట్టు పడుతున్నారు.
మంత్రుల రేసులో వీరే.
మలి విడత మంత్రి వర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం ఉన్నది. అదిష్టానం ఆదేశాల ప్రకారం నలుగురికి అవకాశం ఇస్తార…లేక ఆరుగురుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. సిఎం మదిలో జాబితా కూడా సిద్దమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా సుదర్శన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా వివేక్ తో పాటు కక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తోంది. ఇక నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపు ఖరారేనని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే సామాజిక వర్గ సమతుల్యతలు. సినీయర్ల ప్రాతినిధ్యం, ఇతరత్రా కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల బిఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యేలకు విస్తరణల్ అవకాశం కూడా లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ రంగారెడ్డి, హైదారాబాద్ లకు అవకాశం ఇవ్వదలుచుకుంటే దానం నాగేందర్ ను తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు.