హైదరాబాద్ : చంచల్‌గూడ జైల్లో ఉండాల్సింది రేవంత్ రెడ్డి.. మన్నె క్రిశాంక్ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను చంచల్‌గూడ జైల్లో కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని కేటీఆర్ తెలిపారు. అసలు తప్పు చేసిన రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే రా.. నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ ను నిపుణుల ముందు పెడుదాం. ఏదీ ఒరిజినల్, ఏది ఫోర్జరి, ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్‌గూడ జైల్లో ఉండాలో తేలిపోతది అని కేటీఆర్ పేర్కొన్నారు.
క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. క్రిశాంక్‌ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. సర్కార్ చేసిన వెధవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు