Wednesday, January 1, 2025
HomeAndhra PradeshRGUKT | ఆర్‌జీయూ కేటీల్లో ఆరేండ్ల బీటెక్ కోర్సులు.. రేప‌టి నుంచి ద‌ర‌ఖాస్తులు

RGUKT | ఆర్‌జీయూ కేటీల్లో ఆరేండ్ల బీటెక్ కోర్సులు.. రేప‌టి నుంచి ద‌ర‌ఖాస్తులు

RGUKT | ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికిగానూ నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rgukt.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 8న ఉద‌యం 11 గంట‌ల‌ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అమవుతుంది. జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. మొత్తం మూడు విడుత‌ల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. అర్హులైన వారిని కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేండ్ల‌ పీయూసీ, నాలుగేండ్ల‌ బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేండ్ల‌ కోర్సులో ప్రవేశాలు పొందుతారు.

సీట్లు ఎలా కేటాయిస్తారంటే..

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం నాలుగు క్యాంపస్‌లలో.. ఒక్కో క్యాంపస్‌కు వెయ్యి సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు 25 శాతం సూపర్‌ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకసారి క్యాంపస్‌ కేటాయించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో బదిలీకి అవకాశం ఉండదు.

ఫీజు వివరాలు..

పీయూసీ కోర్సుకి ట్యూషన్‌ ఫీజు కింద ఒక్కో ఏడాది రూ.45 వేలు చెల్లించవల్సి ఉంటుంది. బీటెక్‌ ప్రోగ్రాంకు ఏడాదికి రూ.50 వేల చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ట్యూషన్‌ ఫీజు కింద ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి.

ముఖ్య‌మైన వివ‌రాలు..

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు- మే 8న‌
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ- జూన్ 25
వెబ్‌సైట్‌: www.rgukt.in

 

RELATED ARTICLES

తాజా వార్తలు