Thursday, April 3, 2025
HomeSportsSourav Ganguly | టీ20 వరల్డ్‌ కప్‌లో రింకూ సింగ్‌ ఎంపిక చేయకపోవడంపై సౌరవ్‌ గంగూలీ...

Sourav Ganguly | టీ20 వరల్డ్‌ కప్‌లో రింకూ సింగ్‌ ఎంపిక చేయకపోవడంపై సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు

Sourav Ganguly | త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ ఇటీవల 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. జట్టులో యువ ఆటగాడు రింకూ సింగ్‌కు నిరాశే ఎదురైంది. అయితే, మాజీ క్రికెటర్లు రింకూ సింగ్‌కు చోటు కల్పించకపోవడంపై మండిపడ్డారు. టీ20 ఫార్మాట్‌కు అతని బ్యాటింగ్‌ శైలి సరిగ్గా సరిపోతుందని.. ఇప్పటికే టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యాన్ని రుజువు చేశాడని పేర్కొంటున్నారు.

తాజాగా భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ సైతం టీ20 వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికపై మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టులోకి స్పిన్నర్‌ తీసుకోవడంతోనే రింకూ సింగ్‌కు చోటు దక్కలేదని తెలిపాడు. అతనికి ఇంకా చాలా కెరీర్‌ ఉందని.. టీమిండియా తరఫున ఇంకా ఎంతో క్రికెట్‌ ఆడాల్సి ఉందని చెప్పాడు. నిర్ణయంపై అతడు నిరుత్సాహపడకూడదని భావిస్తున్నానని.. జట్టు ఎంపికలో సెలెక్టర్లు, కెప్టెన్‌ రోహిత శర్మ అత్భుతంగా పని చేశారని.. తాను చూసిన అత్యుత్తమ జట్లలో ఇది ఒకటి గంగూలీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. వచ్చే నెల అంటే జూన్‌ 2 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ జరుగనున్నది. జూన్ 29న జ‌రిగే ఫైన‌ల్ టోర్నీ ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్‌-ఏలో టీమిండియాతో పాటు కెన‌డా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన భార‌త్‌, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానున్నది. జూన్ 9న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగనున్నది.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

రిజర్వ్ ఆట‌గాళ్లు

శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

టీ 20 ప్రపంచకప్‌లో భార‌త్‌ షెడ్యూల్ ఇదే

భార‌త్ – ఐర్లాండ్‌ – జూన్‌ 5 (న్యూయార్క్)
భార‌త్ – పాకిస్థాన్‌ – జూన్‌ 9 (న్యూయార్క్)
భార‌త్ – యూఎస్‌ఏ – జూన్‌ 12 (న్యూయార్క్)
భార‌త్ – కెనడా – జూన్‌ 15 (ఫ్లోరిడా)

RELATED ARTICLES

తాజా వార్తలు