Sunday, December 29, 2024
HomeTelanganaResignation | రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా

Resignation | రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా

*రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా
*
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటన

రహదార్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) గణపతి రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈఎన్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం తన రాజీనామా లేఖను రహదార్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ కు ఆయన అందజేశారు. 2017లోనే గణపతి రెడ్డి రిటైర్ అయినప్పటికీ , గత ఏడేళ్ళుగా ఈఎన్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం గణపతి రెడ్డిని కొనసాగించింది. అలాగే ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ సైతం ఆయనను తొమ్మిది నెలలుగా ఈఎన్సీగా కొనసాగించింది. వరంగల్ మల్టీ సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని టిమ్స్‌ ఆసుపత్రుల అంచనాల పెంపుపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతున్న వేళ గణపతి రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్డు ( ఆర్‌ఆర్‌ఆర్‌) బాధ్యతలను గణపతి రెడ్డి చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విషయానికి సంబంధించి కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్, జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, సచివాలయం ముందున్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వంటి నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాల వ్యయం బడ్జెట్ పెంపుపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

తాజా వార్తలు