దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచం లోనే ఆత్మహత్య చేసుకున్న మొదటి రోబోగా తెలియ వచ్చింది.
దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది. అయితే, రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతున్నది. రోబో దానికదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరిగే అవకాశం ఉందని.. ఇదే గనుక కొనసాగితే మానవాళికి తీరని ముప్పు రోబోల ద్వారా ఉంటుందని, ఇటీవల ఒక రోబోని ఇంటర్వ్యూ చేసిన సమయంలో మనుషులను ఎలా ట్రీట్ చేస్తారు అని అడిగితె ఆ సమాధానానికి మనుషులు నోరు వెళ్ళబెట్టాల్సి వచ్చింది అని గుర్తు చేసుకొన్నారు.
Robot Suicide: రోబో మొదటి ఆత్మహత్య..
RELATED ARTICLES