Rohit Sharma| భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని కలవరపెడుతుంది. మరి కొద్ది రోజులలో టీ20 వరల్డ్ కప్ ఆడనున్న రోహిత్ ఐపీఎల్‌లో పరుగులు రాబట్టలేకపోతున్నాడు. అతను ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 49, CSKపై అజేయంగా 105 పరుగులు చేయగా, మిగతా మ్యాచ్‌లన్నింటిలో చాలా నిరాశపరిచాడు. ఈ మధ్య జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ స్కోరు చేశాడు. అయితే రోహిత్ ఫామ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. రోహిత్ తన ఫామ్ తెచ్చుకోవడానికి రెండే ఛాన్స్‌లు ఉన్నాయి. ముంబై వరుసగా మే 11, 17 న KKR, లక్నోతో ఆడనుండగా, ఈ రెండు మ్యాచ్‌లలో మంచి స్కోరు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఇటీవల రోహిత్ శర్మ ఫామ్ గురించి హర్షా భోగ్లే స్పందిస్తూ.. ఐపీఎల్ 2024లో తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 34 పరుగులు మాత్రమే రోహిత్ చేశాడని.. ఇది టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారీ ఆందోళన కలిగించే విషయంగా హర్షా భోగ్లే పేర్కొన్నాడు. అయితే రోహిత్‌పై విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోమవారం SRHతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని సూర్య కుమార్ యాదవ్ సునామి ఇన్నింగ్స్ చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
రోహిత్ శర్మ ఈ సారి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా ఆడుతున్నాడు. అయితే టీమిండియాకి మాత్రం నాయకత్వం వహించబోతున్నాడు. అతని కెప్టెన్సీలోనే టీ20 వరల్డ్ కప్ ఆడనుంది భారత్. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈ సారి వరల్డ్ కప్ సాధించి భారతీయులందరికి తీపి జ్ఞాపకాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.