Sunday, December 29, 2024
HomeSportsRohit Sharma|తొలిసారి ముంబై కెప్టెన్సీ మార్పుపై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. ఏం అన్నారంటే..!

Rohit Sharma|తొలిసారి ముంబై కెప్టెన్సీ మార్పుపై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. ఏం అన్నారంటే..!

Rohit Sharma| ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా ఉంటూ ఆ జ‌ట్టుకి అద్భుత‌మైన విజ‌యాలు అందించిపెట్టిన రోహిత్ శ‌ర్మ‌ని ఈ సారి ఓ ఆట‌గాడిగానే ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండ‌గా, అత‌ని నేతృత్వంలో జ‌ట్టు ఆడుతుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడ‌గా, అందులో మూడు మాత్ర‌మే ముంబై జ‌ట్టు గెలిచింది. దీంతో ప్లే ఆఫ్ అవ‌కాశాలు కూడా స‌న్న‌గిల్లాయి. అయితే కొద్ది రోజులుగా రోహిత్‌ని తొల‌గించి పాండ్యాని కెప్టెన్ చేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. , రోహిత్ ఫ్యాన్స్.. హార్దిక్ పాండ్యాని నెట్టింట ట్రోల్ చేయడం, మైదానంలో దూష‌ణకి దిగ‌డం వంటివి చేశారు. అయితే తొలిసారి ముంబై కెప్టెన్సీపై రోహిత్ శర్మ స్పందించారు.

మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచకప్‌ మెగా టోర్నీ కోసం ఇటీవల బీసీసీఐ భారత జట్టును ప్రకటించ‌గా, దానికి సంబంధించి చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి రోహిత్ శ‌ర్మ కూడా హ‌జ‌ర‌య్యారు. అయితే ఆ స‌మ‌యంలో ముంబై కెప్టెన్సీకి సంబంధించి తొలిసారి స్పందించారు రోహిత్. ఈ రోజు నేను ఇండియా కెప్టెన్‌గా ఉన్నా రేపు ఉండ‌క‌పోవ‌చ్చు. జీవితంలో ఇది ఒక భాగం మాత్ర‌మే అని, మ‌నం అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వ‌ని రోహిత్ శ‌ర్మ తెలియ‌జేశాడు. గ‌తంలో తాను ఇత‌రుల నాయ‌క‌త్వంలో ఆడిన‌ట్టు గుర్తు చేసుకున్న రోహిత్ తాను ఒక క్రీడాకారుడిగా ఆడేందుకు ఎప్పుడు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పాడు. గత నెల రోజులుగా తాను అలానే చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇక జ‌ట్టులో న‌లుగురు స్పిన్న‌ర్స్‌కి అవ‌కాశం కల్పించ‌డంపై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. నలుగురిని ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు కాదు.. వెస్టిండీస్‌ లో వెల్లడిస్తామని అన్నాడు. ఇక మిడిల్‌ ఆర్డర్‌ లో స్వేచ్ఛగా ఆడగలిగే క్రికెటర్‌ ఉండాలనే ఉద్దేశంతోనే శివ‌మ్ దూబేని ఎంపిక చేసిన‌ట్టు తెలియ‌జేశాడు అజిత్ అగార్క‌ర్. ఇక హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉన్న‌న్ని రోజులు జ‌ట్టులో ఉండాల‌ని తాము భావిస్తామ‌ని, ఆ విష‌యంలో ఎవ‌రు సందేహించ‌న‌క్క‌ర్లేదంటూ కూడా అజిత్ అన్నారు. అయితే జ‌ట్టులో రాహుల్‌, రింకూ సింగ్ ని ఎంపిక చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల కొంద‌రు ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు