Saturday, January 4, 2025
HomeSportsRohit Sharma| ముంబై ఇండియ‌న్స్‌కి రోహిత్ శ‌ర్మ గుడ్ బై చెప్పిన‌ట్టేనా.. సంచ‌ల‌నంగా మారిన వీడియో

Rohit Sharma| ముంబై ఇండియ‌న్స్‌కి రోహిత్ శ‌ర్మ గుడ్ బై చెప్పిన‌ట్టేనా.. సంచ‌ల‌నంగా మారిన వీడియో

Rohit Sharma| ముంబైకి ఐదు టైటిల్స్ సాధించి పెట్టిన రోహిత్ శ‌ర్మ‌ని కాద‌ని హార్ధిక్ పాండ్యాని కెప్టెన్సీ చేయ‌డం ప‌ట్ల అభిమానులు ఎంత గుర్రుగా ఉన్నారో మ‌నం చూసాం.ముంబై ఇండియ‌న్స్ ఇన్‌స్టాగ్రామ్‌ని రెండు ల‌క్ష‌ల మంది అన్‌ఫాలో చేశారు. ముంబై ఇండియ‌న్ జెర్సీల‌ని త‌గ‌ల‌బెట్టారు. హార్ధిక్ పాండ్యాని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఇంత జ‌రుగుతున్నా కూడా రోహిత్ శ‌ర్మ ఏ నాడు కూడా దీనిపై స్పందించింది లేదు. అయితే ఐపీఎల్‌కి ముందు మాత్రం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బాగా ప్రిపేర్ అయ్యేందుకు ఐపీఎల్‌కి 2024కి దూరంగా ఉన్న‌ట్టు తెలియ‌జేసి వెంట‌నే ఆ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్ నుండి తొల‌గించాడు. అయితే త‌న‌ని కెప్టెన్సీ నుండి తీసేసిన విష‌యంలో రోహిత్ స్పందించింది లేదు.

కాని రీసెంట్‌గా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌తో త‌న బాధనంతా వెళ్ల‌గ‌క్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. వీడియోని కేకేఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి వెంట‌నే డిలీట్ చేసింది. కాని అప్ప‌టికే వీడియో బాగా వైర‌ల్ అయింది. ఇందులో రోహిత్ మాట్లాడుతూ.. ఒక దాని త‌ర్వాత ఒక‌టి మారుతుంది. అందుకు కార‌ణం వాళ్లే. అది ఏమైన ఇది నా ఇల్లు. నేను ఎక్క‌డికి వెళ్ల‌ను. ఇది నేను నిర్మించిన గుడి. నాకేంటి.. ఇదే నాకు లాస్ట్ అంటూ రోహిత్ కామెంట్ చేశాడు. రోహిత్ మాట‌ల‌ని అర్ధం చేసుకుంటే.. త‌న‌ని కెప్టెన్సీ నుండి త‌ప్పించ‌డం, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీం భారీ మూల్యం చెల్లించుకుంది అన్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది.

రోహిత్ ఉండేది ముంబైలో. అక్క‌డ మ‌నోడికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ముంబైని త‌న ఇల్లుగా చెప్పాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ నుండి త‌న‌కు ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌, అభిమానం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ముంబై ఇండియన్స్‌ టీమ్‌ అంత స్ట్రాంగ్‌ అవ్వడానికి, ఐదు కప్పులు గెలవడానికి కారణం నేను, అది నేను సృష్టించిన సామ్రాజ్యం అంటూ రోహిత్ శ‌ర్మ కామెంట్స్ చేశాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న గురించి త‌న‌కేమి సంబంధం లేద‌ని, ఇది ముంబై ఇండియ‌న్స్‌తో లాస్ట్ సీజ‌న్ అని రోహిత్ శ‌ర్మ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు