VC Sajjanar | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంటారు. రోడ్డు భద్రత, ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ఆయన నెటిజన్లతో పంచుకుంటూనే.. ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తుంటారు. తాజాగా ‘ఎక్స్’ (ట్వట్టర్)లో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ యువకుడు తన ప్రేమికురాలితో కలిసి స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా దూసుకెళ్లడం కనిపించింది. కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్క నుంచి మరో వాహనదారుడు రావడంతో రెండు బైక్‌లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.
దాంతో రెండు వాహనాలపై ఉన్న వారంతా కిందపడిపోడిపోవడం కనిపించింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఎవరూ ? అంటూ సజ్జనార్ నెటిజన్లను ప్రశ్నించారు. అతివేగమా.. లేకపోతే నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా..? ఇందులో ఏ కారణంతో ప్రమాదం జరిగిందో చెప్పాలన్నారు. ఈ వీడియోను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతో పాటు టీం రోడ్ స్క్వాడ్‌కు సైతం ట్యాగ్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు స్పందించారు. ఇద్దరు వాహనదారులదీ తప్పేనని చెప్పారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా కఠిన శిక్షలు విధిస్తే వాహనదారులు దారికి వస్తారన్నారు. వేగాన్ని నియంత్రించేందుకు జంక్షన్ల వద్ద స్పడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని పలువురు యూజర్లు కోరారు.
ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!?
➡️ అతివేగమా!?
➡️ నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా!?@MORTHIndia@Team_Road_Squad #RoadAccident #RoadSafety pic.twitter.com/EiXezsBbMH
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 22, 2024