Sai Pallavi| సాయి పల్లవి..ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందానికి అందం, నటనకు నటన, డ్యాన్స్‌కి డ్యాన్స్.. ఎందులోని సాయి పల్లవి తక్కువ కాదు. తనకి ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా సాయి పల్లవి సినిమాలలో పద్దతిగా కనిపిస్తూ రచ్చ చేస్తుంది. తనకి నచ్చని సినిమాలకి వెంటనే నో చెప్పేస్తుంది. ఎండార్స్‌మెంట్‌ని కూడా పక్కన పెట్టేస్తుంటుంది. సాయి పల్లవి రూటే సపరేటు. ఆమె లేడి పవర్ స్టార్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
తాజాగా సాయి పల్లవికి సంబంధించిన వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఆమెని కూడా ఓ దర్శకుడు లైంగికంగా వేధించాడు అని టాక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ సాయి పల్లవిని కమిట్‌మెంట్ అడిగాడట. ఆమె పడక సుఖం అందిస్తే తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పాడట. అతగాడి మాటలు విన్న సాయి పల్లవి ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా డైరెక్టర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. నాతో కమిట్‌మెంట్ కావాలా… నీపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను. నిన్ను రోడ్డుకీడుస్తాను అంటూ అతనిపై ఫుల్ ఫైర్ అయిందట. అయితే సాయి పల్లవి రియాక్షన్ చూసిన దర్శకుడు క్షమాపణలు కోరాడట.
ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ వార్త అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాయి పల్లవి లాంటి టాలెంట్ ఉన్న నటికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా అంటూ మండిపడుతున్నారు. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ అనే మూవీ చేస్తుంది. లవ్ స్టోరీ మూవీ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నచిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. చందూ మొండేటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు. ఈసినిమా మంచి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.