Salar2 | బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు చేశాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.ఆ సమయంలో ప్రశాంత్ నీల్ సలార్ రూపంలో ప్రభాస్‌కి మంచి హిట్ అందించాడు. ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అయితే సలార్ చిత్రం మంచి హిట్ కావడంతో సలార్ 2 కూడా వస్తుందని ఫ్యాన్స్ భావించారు. ఇదే నేపథ్యంలో సలార్2 చిత్రానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సలార్ 2 సెట్స్ మీదకు వెళ్తుందా.. ? ఎప్పుడెప్పుడు శౌర్యంగ రాజు గా ప్రభాస్ కనిపిస్తాడా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న సమయంలో సలార్ 2కి బ్రేక్ పడినట్టు ప్రచారం జరుగుతుంది.
సలార్ అసలు కథని దర్శకుడు పార్ట్ 2 కోసం దాచేశాడు.అయితే సలార్ అసంతృప్తి పరిచిందని ఓ వర్గం విమర్శలు గుప్పించడంతో పాటు కొన్ని ఏరియాల్లో సలార్ నష్టాలు మిగిల్చింది. మూవీపై ఎవరికి ఎక్కువ ఫోకస్ లేదని తెలియడంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమా పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. సలార్2ని పక్కన పెట్టేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడనే వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మేకర్స్ కి సలార్ 2 పట్ల ఆసక్తి లేని క్రమంలో ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్లే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది
అయితే దీనిపై ప్రశాంత్ నీల్ కూడా స్పందించినట్టు టాక్ నడుస్తుంది. త్వరలో సలార్ 2 పట్టాలెక్కుతోందని అన్నట్టు సమాచారం.. కెజిఎఫ్ నుండి బయటకు రావడానికి తనకు కొంత సమయం పట్టింది, బ్రేక్ తీసుకుని సలార్ చేశాను. ఇప్పుడు కూడా కొంత విరామంకావాలి. అలాగే కెజిఎఫ్ 3 కూడా ఉంటుంది. స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. అయితే యష్ పలు కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. కెజిఎఫ్ 3 కి సమయం పడుతుంది. సలార్ 2 కచ్చితంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పినట్టు టాక్.