Monday, December 30, 2024
HomeCinemaSamantha| స‌మంత లిప్ లాక్ వీడియో ఔట్.. చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Samantha| స‌మంత లిప్ లాక్ వీడియో ఔట్.. చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి తెగ వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. ఏదో ఒక విష‌యంతో ఈ అమ్మ‌డి పేరు నెట్టింట మారుమ్రోగుతూ ఉంటుంది. మయోసైటిస్ బారిన ప‌డి ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉన్న సమంత ఇప్పుడు తిరిగి మూవీల‌పై దృష్టి పెట్టింది. ఇక సమంత ఫిట్‌ ఫ్రీక్‌ అన్న విషయం తెలిసిందే. జిమ్‌లో ఆమె చేసే కసరత్తులకి సంబంధించి ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. వ్యక్తిగత జీవితంలో ఏర్ప‌డిన‌ ఒడిదుడుకులు, విడాకులు కారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ మయోసైటీస్ వ్యాధి బారిన ప‌డిన స‌మంత ఆ వ్యాధి నుండి కోలుకునేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసింది.

ఇప్పుడు చాలా యాక్టివ్‌గానే క‌నిపిస్తుంది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత స‌మంత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి సినిమా ఆమెకి పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఇక ఆ సినిమా త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించింది లేదు. రీసెంట్‌గా స‌మంత కొత్త మూవీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. బంగారం అనే టైటిల్‌తో ఈ మూవీ రిలీజ్ కానుంది. మ‌రోవైపు బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ”హనీ, బన్నీగా” పెట్టినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియ‌జేసింది. మరోవైపు అల్లు అర్జున్- తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాలో స‌మంత‌ని క‌థానాయిక‌గా ఫిక్స్ చేసార‌ని స‌మాచారం.

అయితే స‌మంత ఇటీవ‌ల త‌న పెంపుడు కుక్క‌లు, పిల్లుల‌తో ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించిన పోస్ట్‌లు కూడా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమంత తన పిల్లితో ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సమంత పిల్లితో ఆడుకుంటూ దానికి లిప్ లాక్ ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. క్యాట్‌కి ప‌దే ప‌దే స‌మంత లిప్ లాక్స్ ఇవ్వ‌డం చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. ఇలాంటి వాటి వ‌ల్ల‌నే లేని పోని రోగాలు వ‌స్తాయంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. ప్ర‌స్తుతం స‌మంత‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు