Samantha| తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది సమంత. ఈ అమ్మడు నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే అందరి నోళ్లలో నానుతుంది. అయితే నాగ చైతన్యతో డివర్స్ తర్వాత సమంతకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. మయోసైటిస్ బారిన పడిన తర్వాత సినిమాలకి దూరమైన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంది.సమంతలో ఇంత హాట్‌నెస్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అసలు ఈ మధ్య ఎందుకు అంత అందాలు ఆరబోసి రచ్చ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.
అయితే మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత ఇప్పుడు తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. మరింత శక్తివంతంగా మారేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రత్యామ్నాయ విధానాలను వెతుకుతున్నానని, ఫార్ ఇన్‌ఫ్రారెడ్ ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని, కండరాలకు రక్తప్రసరణ మెరుగ్గా అందుతుందని, జీవక్రియను పెంచడంతోపాటు శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుందని సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్ ద్వారా తెలియజేసింది. ఇలా చేస్తే తగ్గిన సెల్యులైట్, చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తుందని, కీళ్లు, కండరాల నొప్పిని తగ్గిస్తుందని, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుందని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
అయితే ఆ పిక్‌లో సమంత కేవలం టవల్‌ని కట్టుకొని కూర్చుంది. అయితే ఈ పిక్‌తో పాటు మరో పిక్ కూడా షేర్ చేసిందని, అందులో న్యూడ్‌గా ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిని సమంత అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సమంత సినిమాల గురించి ఒకవైపు చర్చ జరుగుతున్న సమయంలో ఇన్స్టాగ్రామ్ పిక్స్ వైరల్ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమంత బర్త్ డే సందర్భంగా ఇటీవల ఆమె సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. బంగారం పేరుతో ఈ చిత్రం రూపొందుతుండగా, పోస్టర్‌లో సమంత చేతిలో గన్ పట్టుకొని షాకింగ్ లుక్‌లో కనిపించింది.