విదేశాలలో ఫొటోషూట్లు చేస్తూ నాలో ఇంకా వన్నె తగ్గలేదన్నట్లుగా గ్లామర్ ఒలకబోస్తోంది. చివరగా తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సమంత ఈ తర్వాత చేసిన బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదల కావాల్సి ఉంది. ఈక్రమంలోసమంత తాజాగా ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది.
స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్ 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ టైటిల్ ఖరారు విషయం తెల్సిందే. కల్పాతి అఘోరం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది.
ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టి కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. అంతేకాకుండా కరానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో ఆయన సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎలక్షన్‌కు వెళ్లే ముందే తన 69వ చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకే కథానాయుయికగా సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నవంబరులో సెట్స్ పైకి వెళ్ళనుంది. విజయ్ సమంత కాంబినేషన్‌లో చిత్రాలు కూడా వచ్చాయి.