Sunday, December 29, 2024
HomeCinemaSamyuktha Menon | అలా చేయడంతో చిరాకేస్తుంది..! తెలుగులో సినిమాలపై సంయుక్త మీనన్‌..!

Samyuktha Menon | అలా చేయడంతో చిరాకేస్తుంది..! తెలుగులో సినిమాలపై సంయుక్త మీనన్‌..!

Samyuktha Menon | మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో బీమ్లా నాయక్‌ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం విలన్‌గా నటించిన రాణాతో జతకట్టింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచాయి. సినిమాలు హిట్‌ సాధించిన ప్రస్తుతం బ్యూటీకి తెలుగులోకి ఎక్కువగా అవకాశాలు రావడంలో చివరిసారిగా నందమూరి కల్యాణ్‌ రామ్‌తో కలిసి ‘డెవిల్‌’లో నటించింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ మరే చిత్రం చేయలేదు. మలయాళం ఓ చిత్రంలో నటిస్తున్నది.

అయితే, పలు తెలుగు చిత్రాల్లో అవకాశం వచ్చినా.. వదులుకుందని తెలుస్తున్నది. ఇటీవల గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాపై ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు చేసింది. తెలుగులో నటించడమంటే చాలా కష్టమని చెప్పింది. ప్రస్తుతం సంయుక్త కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎదురైన పరిస్థితులతో పాటు కష్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమాల్లో నటించడం కష్టమని.. భాష రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పింది. అలాగే మేకప్‌.. చెప్పేందుకు చాలా చిన్నదని.. తన వరకు పెద్ద విషయమేనని చెప్పింది.

మలయాళ చిత్రాల్లో మేకప్‌ త్వరగా అవుతుందని.. అక్కడ చాలా సహజంగా కనిపిస్తామని చెప్పింది. తెలుగులో మేకప్‌ ఎక్కువగా వేస్తుందని.. జాగ్రత్తలు తీసుకోవాలని.. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నామనేది చాలా ముఖ్యమన్నారు. మేకప్ ఎక్కువగా ఉండడంతో.. ముఖంపై ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుందని.. చిరాకుగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం సంయుక్త మీనన్‌ చేతులో రెండు చిత్రాలున్నాయి. మలయాళంలో ‘రామ్‌’ చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో స్వయంభు చిత్రంలో నటిస్తోంది.

RELATED ARTICLES

తాజా వార్తలు