Sania Mirza| భారత టెన్నిస్ లో స్టార్ ప్లేయర్‌గా ఓ వెలుగు వెలిగిన సానియా మీర్జా ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూశాం. కొన్నాళ్లపాటు ఈ ఇద్దరు సంతోషంగానే జీవితం గడిపారు. అయితే ఏమైందో ఏమో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడం, వాటి వలన తమ 14 సంవత్సరాల వైవాహిక బంధానికి బీటలు వారడం జరిగింది. అయితే సానియా నుండి విడిపోయిన కొద్ది రోజులకి షోయబ్ మాలిక్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులుగా ఆమెతో ప్రేమలో ఉండి చివరికి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ప్రేమ విషయం తెలిసే సానియా విడాకులు ఇచ్చిందనే ప్రచారం నడిచింది.
షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్న తర్వాత సానియా మీర్జా సైలెంట్ అయింది కాని ఎక్కడ కూడా తన రెండో పెళ్లి ప్రస్తావన తేలేదు. అయితే ఆమె రెండో పెళ్లికి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ టెలివిజన్ లో ఓ న్యూస్ షోలో పాల్గొన్న జాఫర్ విడాకులు తీసుకుంటే రెండోపెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా ఉంటే సరిపోదా? అని సానియా మీర్జా చెప్పిన మాటకు అతని అభిప్రాయం ఏంటని యాంకర్ అడగగా, జాఫర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. విడాకులు తీసుకున్నంతమాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదని, విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టమైన విషయం అయిప్పటికీ ఆ తర్వాత జీవితం చీకటిగా మారకూడదని అతను చెప్పుకొచ్చారు.
సానియా.. నీకు మంచి భాగస్వామి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకో అని కూడా సలహా ఇచ్చారు. సానియా రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే షోయబ్ ఇప్పటికే రెండో పెళ్లి చేసుకోగా, ఆమె చేసుకుంటే ఏం తప్పు అని అన్నాడు.. ప్రస్తుతం జాఫర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సానియా మీర్జా తెలుగులో ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని, వారి బంధాన్ని వివాహ బంధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరనే దానిపై ఇప్పుడు తెగ ఆరాలు తీస్తున్నారు