గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ‘స్టే’ విధించిన సుప్రీంకోర్టు
కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని కోరిని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్
గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమన్న ధర్మాసనం
కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందన్న ధర్మాసనం
ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి అన్న ధర్మాసనం
తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేసిన బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ
విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన ధర్మాసనం.
ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం
ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం