తెలంగాణలో ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 (September 17)
సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 1948 వ సంవత్సరం, సెప్టెంబర్ 17న ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం భారత సమాఖ్యలో(ఇండియన్ యూనియన్లో) విలీనం అయింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, స్థానిక సంస్థలలో, గ్రామ పంచాయితీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.
అయితే వివిధ పార్టీలు సెప్టెంబర్ 17 జరిగిన చారిత్రక సంఘటన పై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండడం గమనార్హం.