రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 100 మంది దాకా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఏడుగురు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పులు నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగింది. ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలిసి స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది నారాయణపూర్ అడవుల్లో గురువారం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణపూర్ అడవుల్లో ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.