Sharukh Khan| ఐపీఎల్ సీజన్ 2024లో కోలకతా కమాల్ అనిపించింది. లీగ్ మొదటి నుండి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ జట్టు ఆఖరి పోరులోనూ అద్భుత ప్రదర్శన కనబరచి కప్ ఎగరేసుకుపోయింది. సరిగ్గా పదేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కేకేఆర్‌కి దక్కడంతో ఆ జట్టు సంబురాల్లో మునిగిపోయింది.అయితే ఈ టోర్నీలో ఎన్నో రికార్డ్‌లు క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్‌లో చతికిలపడింది. స్టార్క్ (2/14), రస్సెల్ (3/19), హర్షిత్ (2/24) దెబ్బకు హైదరాబాద్ కేవలం 113 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ఇక 114 పరుగుల లక్ష్యాన్ని అలవకోగా చేధించి ఐపీఎల్ చరిత్రలో ముచ్చటగా మూడో సారి కప్ ఎగరేసుకుపోయింది కేకేఆర్ జట్టు.
అయితే గత రెండు సీజన్స్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన కేకేఆర్ జట్టు ఈ టోర్నీలో మూడంటే మూడే ఓడిపోయింది. ఇంత అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరచడం వెనక గంభీర్ హస్తం తప్పక ఉంది. 2012, 2014 సీజన్లలో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిళ్లు గంభీర్ నాయకత్వంలోనే వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఒక్క టైటిల్ కూడా అందుకోలేకపోయింది. అయితే ఈ సీజన్‌కి కేకేఆర్‌కి గంభీర్ మెంటార్‌గా ఉండగా, ప్రతి మ్యాచ్‌లోను తనదైన దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ కోల్‌కతాకి మంచి విజయాలు దక్కేలా చేశాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యం, గంభీర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన ఆటతో టైటిల్ కొట్టేసింది. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది.
అయితే ఫైనల్ గెలిచాక ఆనందంలో కోల్‍కతా కో-ఓనర్, బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టారు. ఇప్పుడు ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక గెలిచాక మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఆటగాళ్లు భుజాన మోసి స్టేడియంలో తిప్పారు. ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా చెపాక్ మైదానంలో తిరుగుతూ సెలెబ్రేట్ చేసుకున్నారు. కోల్‍కతా ప్లేయర్లను కౌగిలించుకుంటూ వారిని అభినందించారు.అయితే టోర్నీ ఆసాంతం అద్భుమైన ప్రదర్శన కనబరచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌లో ఓడిపోవడంతో కన్నీరు పెట్టుకుంది. కావ్య మారన్ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కావ్య ఏడుస్తూనే తన టీమ్ ఆటగాళ్లతో పాటు కేకేఆర్ ఆటగాళ్లని చప్పట్లతో అభినందించడం కొసమెరుపు