Wednesday, January 1, 2025
HomeCinemaSharukh Khan|షారూఖ్ అభిమానులు కంగారు ప‌డొద్దు.. ఆయ‌న ఆరోగ్యానికి ఏమైందంటే..!

Sharukh Khan|షారూఖ్ అభిమానులు కంగారు ప‌డొద్దు.. ఆయ‌న ఆరోగ్యానికి ఏమైందంటే..!

Sharukh Khan| బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆసుప‌త్రిలో చేరాడ‌నే వార్త నెట్టింట తెగ వైర‌ల్ అయింది. దీంతో ఆయ‌న అభిమానులు చాలా ఆందోళ‌న చెందారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంగళవారం తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) – సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ చూడ‌టానికి వెళ్లిన షారూఖ్ స్టేడియంలో చాలా ఉత్సాహంగా కనిపించాడు. త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు వికెట్ తీసిన‌ప్పుడు, సిక్స‌ర్స్, ఫోర్స్ కొట్టిన‌ప్పుడు ఫుల్ జోష్‌లో క‌నిపించిన షారూఖ్ అలా ఎలా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడంటూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు.మ్యాచ్ జ‌రిగిన స‌మ‌యంలో ఖాన్‌తో పాటు అతడి కుమార్తె సుహానా ఖాన్, చిన్న కుమారుడు అబ్రామ్ .. అతడి మేనేజర్ పూజా దడ్లానీల‌తో పాటు సుహానా సన్నిహితులు అనన్య పాండే, షానయ కపూర్, నవ్య నంద, అగస్త్య నందలతో పాటు KKR సహ-యజమానులు జూహీ చావ్లా – జే మెహతా ఉన్నారు.

అహ్మదాబాద్‍లో సుమారు 45 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో షారుఖ్ డీహైడ్రేషన్‍కు గురైన‌ట్టు తెలుస్తుంది. ఆ కార‌ణంగానే ఆయ‌న అహ్మదాబాద్ లోని KD హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అయితే కేవలం వడదెబ్బ వల్లే అత‌నిని ఆసుప‌త్రిలో చేర్పించార‌ని, ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం పూర్తిగా కుద‌ట ప‌డింద‌ని అంటున్నారు.ఉదయం షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ముంబైకి బయలుదేరినట్టు సమాచారం. ఇక షారుఖ్ ని కలవడానికి ఆ మ్యాచ్ కి వచ్చిన షారుఖ్ ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాస్పిటల్ లోనే ఉండి షారూఖ్ ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్పటిక‌ప్పుడు వాక‌బు చేశార‌ట‌.

ప్ర‌స్తుతం షారూఖ్ ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షారూఖ్ ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు గౌరీ ఖాన్ ఆందోళ‌న‌తో క‌నిపించింది. విష‌యం తెలుసుకున్న జూహీ చావ్లా త‌న‌ భర్త జే మెహతాతో కలిసి షారూఖ్‌ని సందర్శించి అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల పాటు షారూఖ్ పూర్తి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంద‌ని వైద్యులు చెప్పిన‌ట్టు స‌మాచారం.

RELATED ARTICLES

తాజా వార్తలు