Sharukh Khan| బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి సినీ ప్రియులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో దశాబ్ధాలుగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇక కేకేఆర్ జట్టు యజమానిగా కూడా ఉన్న షారూఖ్..అందులోను సక్సెస్ ఫుల్‌గా సాగుతున్నాడు. ఇటీవల కేకేఆర్ జట్టు ఫైనల్ ట్రోఫీ అందుకోవడంతో షారుక్ ఖాన్ సంబరాలు అంబరాన్ని అంటాయి. కూతురు సుహానాకు షారూఖ్ ఖాన్ స్వాగతం పలికాడు. కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్‌కి షారూఖ్ ఖాన్ హగ్ ఇచ్చాడు. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు. 10 సంవత్సరాల తర్వాత, KKR మరోసారి విజయం సాధించడంతో ఫుల్ ఎమోషనల్ అయిన షారూఖ్ ప్రేమతో ముద్దు పెట్టాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని అయిన షారూఖ్ ఖాన్ చాలా రిచ్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన ఎప్పుడు లగ్జరీ వస్తువులు వాడుతూ వార్తలలో నిలుస్తుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ ‘రిచర్డ్ మిల్లే’ కంపెనీకి చెందిన వాచ్ ధరించి వార్తలలోకి ఎక్కాడు. ఈ వాచ్ ధర తెలిసిన వారికి మైండ్ బ్లాక్ అవుతుంది. ‘రిచర్డ్ మిల్ ఆర్ ఎం 052’ వాచ్ ధర రూ.11 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ వాచ్ ధరతో ఓ భారీ సినిమా కూడా తీయవచ్చు. చాలా మంది లైఫ్ ను సెట్ అవుతాయి అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, షారూఖ్ ఖాన్ ఈ వయస్సులోను ఎంతో ఉత్సాహంగ సినిమాలు చేస్తున్నారు. పలురకాల బిజినెస్‌లు కూడా ఉన్నాయి. గతేడాది షారుక్ ఖాన్ ‘జవాన్’, ‘పఠాన్’, ‘డంకీ’ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. షారూఖ్ ఖాన్ ఒక్కో సినిమాకి వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అలాగే కొన్ని ప్రకటనల్లో నటిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తుంటాడు. ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఆయనకి ఉండగా, దాని నుంచి కూడా భారీగా డబ్బు సంపాదిస్తాడు షారుక్. ఎన్నో వెంచర్లలో డబ్బును పెట్టుబడిగా పెట్టి ప్రతి సంవత్సరం తన ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.