Shikar Dhawan| చాలా మంది ఆటగాళ్లు ఇప్పుడు రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నారు.కొందరు సీనియర్ క్రికెటర్స్ ఇప్పుడు జరుగుతున్నఐపీఎల్‌లో అంతగా రాణించకపోవడంతో ఇదే రిటైర్మెంట్ ప్రకటనికి సరైన టైమ్ అని అనుకుంటున్నారు. ఐపీఎల్ తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక వారితో పాటు వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ కూడా ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం టీమిండియాలోను, ఐపీఎల్‌లోను అవకాశం రావడం చాలా కష్టంగా మారింది. యువ క్రికెటర్స్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో సీనియర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అయితే శిఖర్ ధావన్ విషయానికి వస్తే అతడు ఐపీఎల్ తర్వాత గుడ్ బై చెప్పబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అతను గాయం నుండి కోలుకున్నా కూడా మేనేజ్‌మెంట్ పక్కన పెడుతుండడం వలన శిఖర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పంజాబ్ తరఫున ధావన్‌కు ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇక భువనేశ్వర్ విషయానికి వస్తే ఆయన టీమిండియా తరపున ఆడి రెండేళ్లు దాటింది. అతని పేరుని ఈ మధ్య కాలంలో ఏ టోర్నీకి పరిశిలించడం లేదు. దీంతో అతను గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్టు సమాచారం.
భువనేశ్వర్ తో పాటు ఇషాంత్ శర్మ కూడా టీమిండియాకి ఆడి చాలా ఏళ్లు అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఇషాంత్ శర్మ ఎనిమిది మ్యాచుల్లో ఆరు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. అప్పటి మాదిరిగా నిప్పులు చెరిగే బౌలింగ్ చేయడం లేదు. దీంతో అతనికి అవకాశాలు పెద్దగా రావడం లేదు. అందుకే ఐపీఎల్ తర్వాత గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. ఇక అన్‌లక్కీ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కూడా రిటైర్మెంట్ ప్రకటించక తప్పదు. టీమిండియా జట్టులో మళ్లీ స్థానం దక్కించుకోవడం చాలా కష్టం. టీమిండియా వికెట్ కీపర్‌గా ఒకటి రెండు అవకాశాలు దక్కినా వాటిలో విఫలం కావడం, ఐపీఎల్‌లో నిలకడ లేకపోవడం అతనికి మైనస్ అయ్యాయి.సాహాకి ఐపీఎల్‌లో కూడా అవకాశం దక్కకపోవచ్చు అంటున్నారు. ఇలా పలు కారణాలతో ఈ ఆటగాళ్లు ఐపీఎల్ పూర్తయ్యాక క్రికెట్‌కి గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తుంది.