Shyamala| బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త వాసు జన్మదిన వేడుకల సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో ఆ రేవ్ పార్టీని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ విభాగం భగ్నం చేసింది. పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్టు ప్రచారాలు సాగాయి. డ్రగ్స్ పార్టీలో నటి హేమ, శ్యామల , శ్రీకాంత్, జానీ మాస్టర్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తమపై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందరు వీడియోలు విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. అయితే యాంకర్ శ్యామల రేవ్ పార్టీకి వెళ్లకపోయిన ఆమె గురించి చాలా దుష్ప్రచరాలు సాగాయి. దీనిపై శ్యామల వీడియో ద్వారా స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బెంగుళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తుండగా.. సందెట్లో సడేమియా అన్నట్టుగా రేవ్ పార్టీకి రాజకీయరంగు పులుమేస్తున్నారు. రేవ్ పార్టీలో జానీ మాస్టర్ దొరికాడంటూ కొన్ని పోస్ట్‌లు దర్శనం ఇవ్వగా , యాంకర్ శ్యామల సైతం ఆ రేవ్ పార్టీలో ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఇండస్ట్రీలో అంత మంది సెలబ్రిటీలు ఉండగా, వీరినే ఎందుకు టార్గెట్ చేశారంటే.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరుఫున ప్రచారం చేసింది. ఇక జానీ మాస్టర్ జనసేన తరుఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు వారిపై ఇలా బురద జల్లే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో శ్యామల స్పందిస్తూ.. జర్నలిజం పేరుతో కొంతమంది దిగజారిపోతున్నారని.. తనకి సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారంటూ, వారికి తప్పక తగిన బుద్ది చెబుతానంటూ శ్యామల వీడియోలో తెలియజేసింది. అసలు రేవ్ పార్టీ ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తనకు తెలియదని, రేవ్ పార్టీలో నేను ఉన్నట్టు ఓ ఛానల్ దుష్ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటే.. ఒక పార్టీతో నేను అనుసంధానం అయ్యి ఉన్నానని తెలిసి.. నాపైన నా పార్టీపైన బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ల అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాం. వాళ్లపై న్యాయపరంగా పోరాడతా. పరువునష్టం దావా వేశాను అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.