Saturday, January 4, 2025
HomeHealthCold Water | మీరు ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతున్నారా?.. అయితే మీకు ఈ ముప్పు పొంచి...

Cold Water | మీరు ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతున్నారా?.. అయితే మీకు ఈ ముప్పు పొంచి ఉన్న‌ట్లే

Cold Water | ఎండ‌లు దంచికొడుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి నీటికి (Cold Water) మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే బ‌య‌టి నుంచి ఇంటికి రాగానే చాలా మందికి ఫ్రిజ్ నీళ్లు తాగడం అలవాటు. దీంతో తొంద‌ర‌గా దూప తీరుతుంద‌ని ఇలా చేస్తుంటారు. అయితే రిఫ్రిజిటిరేట‌ర్‌లోని నీళ్లు తాగ‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. అసలు వారేం చెబుతున్నారో చూద్దాం..

ఎండ‌లో చ‌ల్ల‌ని నీరు తాగడానికి బాగుంటుంది. కానీ అతిగా చల్లగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం చల్లని నీరు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని చెబుతున్నారు. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, టాన్సిలిటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

చ‌ల్ల‌ని నీరు, డ్రింక్స్ జీర్ణ క్రియ‌ని బ‌ల‌హీన‌ప‌రుస్తాయి. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తీసుకొస్తుంది. వీటితోపాటు ర‌క్త‌నాళాలు కుంచించుకుపోతాయి. ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి అదనపు శక్తి అవసరమవుతుంది. ఇది మొదట జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం సమస్య వస్తుంది.

నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను వాగస్ నాడి నియంత్రిస్తుంది. చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఫలితంగా కొవ్వును కరిగించడం సాధ్యం కాదు. ఇది పరోక్షంగా బరువు పెరుగుటకు దారితీస్తుంది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు