Sleep In Luggage Cabin | ప్రయాణ సమయంలో ఎవరికైనా నిద్ర వస్తే ఏం చేస్తారు? కూర్చున్న సీట్లోనే నిద్రపోతారు. కానీ, ఓ ప్రయాణికురాలు మాత్రం విమానం సీటులో కూర్చొని నిద్రపోతే ఏం కిక్కు ఉంటుంది అనుకుందో ఏమో.. ఏకంగా లగేజీ కంపార్ట్‌మంట్‌లోకి దూరింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగిందని ‘న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. టికెట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 50లక్షలకుపైగానే వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను పలువురు యూజర్లు రకరకాలుగా స్పందించారు. ‘ప్రయాణికులకు నచ్చిన సీటును సెలెక్ట్ చేసుకునే అవకాశం సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్‌లో ఉన్నట్లుంది’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘నా సీట్లో ఎవరు కూర్చున్నా నేను పట్టించుకోనని మరో నెటిజన్ కామెంట్ చేయగా.. పలువురు ఆమె అందులోకి ఎలా వెళ్లిందంటూ? అనుమానం వ్యక్తం చేశారు.
చాలామంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇదే ఎయిర్‌లైన్స్‌లో 2019లో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం. టెన్నిసీలోని నాష్ విల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ లగేజీ కంపార్ట్‌మెంట్‌లో కనిపించింది. దీనిపై అప్పట్లో ఆ ఎయిర్ లైన్స్ సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ప్రయాణికులను కాసేపు సరదాగా నవ్వించేందుకే తమ ఫ్లైట్ అటెండెంట్ ఇలా చేసిందంటూ చెప్పింది.
📌 U.S southwest airlines passenger pic.twitter.com/B7p0T8xOBf
— KASİDE (@zakkumec) May 10, 2024