PM Robert Fico | స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై (PM Robert Fico) ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఓ మంత్రి వెల్లడించారు. దేశ రాజధాని బ్రటిస్లావాకు 140 కిలోమీటరల్ల దూరంలో ఉన్న హాండ్లోవాలో మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం బయటకు వస్తున్న ఫికోపై దుండగుడు గన్‌తో షూట్ చేశాడు. దీంతో ఫికో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన పొట్ట, తల భాగంలో గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను దవాఖానకు తరలించారు. మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిగినట్లు అధికారులు తెఇపారు.
కాగా, చికిత్స అందుతున్నదని, ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హాండ్లోవాలోని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో రాబర్ట్ ఫికో స్పృహలోనే ఉన్నారని వెల్లడించారు. వరుసగా కాల్పులు జరపడం తాను చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. మరోవైపు పోలీసులు కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ దుండగుడు ఎందుకు ప్రధానిపై కాల్పులు జరిపాడనేది మాత్రం వెల్లడికాలేదు.
ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జుజానా కాపుటోవా ఖండించారు. ప్రధాని ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే రష్యా అనుకూలవాది అయిన ఫికో ప్రస్తుతం మూడోసారి ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.
BREAKING: VIDEO OF SLOVAKIA PRIME MINISTER ROBERTO FICO BEING DRAGGED AWAY AFTER HE WAS SHOT MULTIPLE TIMES pic.twitter.com/Sm2eSYisLe
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 15, 2024