Wednesday, January 1, 2025
HomeNationalSolar Storm | సూర్యుడి ఉపరితలంపై భారీ విస్పోటనాలు..! ఫొటోలు షేర్‌ చేసిన నాసా

Solar Storm | సూర్యుడి ఉపరితలంపై భారీ విస్పోటనాలు..! ఫొటోలు షేర్‌ చేసిన నాసా

Solar Storm | సూర్యుడి ఉపరితలంపై శుక్ర, శనివారాల్లో రెండు భారీ విస్పోటనాలు సంభించాయి. దాంతో పెద్ద ఎత్తున సౌర జ్వాలలు ఎగిసిపడ్డాయని.. అవి సౌర తుఫానుగా భూమిని తాకాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ కెమెరాలు ఈ విస్పోటనాలను బంధించాయి. ఈ ఫొటోలను నాసా ఎక్స్‌ వేదికగా విడుదల చేసింది. ఈ నెల 10-11 తేదీల్లో సూర్యుడిపై నుంచి శక్తివంతమైన జ్వాలలు వెలువడ్డాయని చెప్పింది.

అమెరికా కాలమానం ప్రకారం 10న రాత్రి 9.20 గంటలకు, మళ్లీ 11న ఉదయం 7.44 గంటల సమయంలో విస్పోటనాలు జరిగాయని పేర్కొంది. వాటి తీవ్రతను వరుసగా ఎక్స్5.8, ఎక్స్1.5గా గుర్తించినట్లు పేర్కొంది. అయితే, భానుడిపై విస్పోటనాల కారణంగా గత రెండు దశాబ్దాలకుపైగా కాలంలో అత్యంత శక్తిమంతమైన సౌర తుపాను శుక్రవారం భూమిని తాకింది. ఇందుకు సంబంధించిన కాంతి ఆకాశంలో కనిపించింది. టస్మానియా నుంచి బ్రిటన్ వరకు ప్రజలు ఆకాశంలో ఈ కాంతిని వీక్షించగలిగారు.

సౌర తుఫానుల కారణంగా ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంటుందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) హెచ్చరించింది. సీఎంఈలుగా (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) పిలిచే సూర్యుడి ఉద్గారాలైన అయస్కాంత క్షేత్రాలు. ప్లాస్మాలు లండన్ కాలమానం (GMT ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకినట్లు తెలిపింది. సౌర తుపానుకు సంబంధించి ఉత్తర యూరప్, ఆస్ట్రేలియాలలో ఏర్పడిన ‘అరోరా’లకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలాంటి పరికరాలు లేకుండా దీనిని చూడగలిగామని పలువురు వివరించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు