కుమారి అంటీ.. ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన పేరు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె పేరే వైరల్ అయింది. ఆమె భోజనం వడ్డించిందీ అంటే మైమరచి తినాల్సిందే, కడుపు నిండాల్సిందే. తన చేతివంట రుచి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఆమె ఫుడ్ స్టాల్‌కి కస్టమర్లు వస్తుంటారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్ పెట్టి వెజ్, నాన్ వెజ్ వంటకాలను అమ్ముతూ చేతినిండా సంపాదిస్తోంది. యూట్యూబ్‌లో మార్మొగిపోయిన కుమారి ఆంటీ దగ్గరికి సందీప్ కిషన్ తోపాటు పలువురు సినీ తారలు కూడా వెళ్లి భోజనం చేశారు.
తాజాగా సోనూసూద్ ఆమె ఫుడ్ స్ట్టాల్‌ను సందర్శించాడు. తనను కలిసి బిజినెస్ ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నాడు. “కుమారి ఆంటీ స్త్రీ శక్తికి తార్కాణం. కష్టపడితే ఫలితం ఉంటుందన్న దానికి ఈవిడే నిదర్శనం’’ అని సోనూ అన్నారు. స్వయంకృషితో ఎదిగే ఇలాంటివారిని సపోర్ట్ చేద్దామని చెప్పారు. నేను వెజ్ తింటాను.. నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తావని సోనూసూద్ అడగ్గా కుమారి ఆంటీ ఫ్రీగా ఇస్తానంది. “కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకున్నారు.. ఇంకెంతో మందికి సాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి మీకు ఏమిచ్చినా తక్కువే’’ అని కుమారి ఆంటీ అనడంతో సోనూసూద్ సంతోషపడ్డాడు. అనంతరం ఆమెకు శాలువాతో సత్కరించారు.