Sreemukhi| బుల్లితెరపై తమ చలాకీ మాటలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచే యాంకరమ్మలు అడపాదడపా వెండితెరపై కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అందాల అనసూయ ఒకప్పుడు యాంకర్‌గా ఓ వెలుగు వెలిగింది. రంగస్థలం చిత్రం ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకురావడంతో ఇప్పుడు పూర్తి స్థాయి నటిగా మారింది. వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఇక రష్మీ కూడా అడపాదడపా పలు సినిమాలలో కనిపిస్తుంది. అలానే శ్రీముఖి సైతం యాంకరింగ్ చేస్తూ సినిమాలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఐటెం సాంగ్ కూడా చేసేందుకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తుంది.
స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న శ్రీముఖి ఇప్పుడు స్టార్ మాని దున్నేస్తుంది. అందులో దాదాపు అన్ని షోలకి శ్రీముఖినే యాంకర్‌గా ఉంది. అయితే హీరోయిన్ కావాలని మొదటి నుండి కసితో ఉన్న శ్రీముఖి ఆ కలని నెరవేర్చుకోలేకపోతుంది. కాస్టింగ్ కౌచ్ వలన హీరోయిన్‌గా ఎదగలేకపోయిన శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు లభించిన తర్వాత సినిమాలలో చిన్నా చితకా పాత్రలు వేస్తూ అలరిస్తుంది. అప్పుడప్పుడు శ్రీముఖి ప్రధాన పాత్రలో కూడా చిత్రాలు రూపొందుతున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేయగా,ఆ చిత్రం అంతగా అలరించలేకపోయింది.
ఇక శ్రీముఖి మంచి బ్రేక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఇదే సమయంలో ఆమెకి ఓ భారీ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిదంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రంలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉండగా, ఇందులో శ్రీముఖి.. చిరంజీవితో కలిసి మాస్ స్టెప్స్ వేయనుందట.చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ లో శ్రీముఖి కొన్ని ప్రత్యేకమైన సీన్స్‌లో కనిపించింది. ఇప్పుడు చిరుతో కలిసి స్టెప్పులు కూడా వేయనుందనే టాక్ నడుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. ఐటెం భామగా శ్రీముఖి సక్సెస్ అయితే ఆమెకి వెండితెరపై
వరుస అవకాశాలు దక్కడం ఖాయం.