Friday, April 4, 2025
HomeSportsSRH vs LSG| వికెట్ న‌ష్ట‌పోకుండా టార్గెట్ చేధించిన స‌న్ రైజ‌ర్స్.. లక్నో బౌల‌ర్స్‌కి మాట‌ల్లేవుగా..!

SRH vs LSG| వికెట్ న‌ష్ట‌పోకుండా టార్గెట్ చేధించిన స‌న్ రైజ‌ర్స్.. లక్నో బౌల‌ర్స్‌కి మాట‌ల్లేవుగా..!

SRH vs LSG|  గ‌త సీజ‌న్స్‌కి భిన్నంగా ఆడుతూ వ‌స్తుంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌.అంతేనా ఏ జ‌ట్టు సాధించ‌ని రికార్డ్‌లు సాధిస్తూ స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సీజ‌న్‌లో భారీ స్కోర్స్ చేసి చరిత్ర సృష్టించిన స‌న్‌రైజర్స్ తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా జరిగిన మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించి 62 బంతులు మిగిలి ఉండగానే గెలిచి అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేశారు. 10 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుపొంది క‌మ్మిన్స్ బర్త్‌డేకి బ్యూటీఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. ముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ల‌క్నో బ్యాట్స్‌మెన్స్ ఈ పిచ్‌పై చాలా ఇబ్బందిగా బ్యాటింగ్ చేశారు .ఆయుష్ బదోనీ (55 నాటౌట్), నికోలస్ పూరన్ (48 నాటౌట్) మాత్ర‌మే కాస్త ప్ర‌తిఘ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ఆ స్కోరు అయిన వ‌చ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు మాత్ర‌మే చేశారంటే ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ ఎంత టైట్‌గా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్ కి ఒక వికెట్ ద‌క్కంది. ఇక లక్ష్యఛేదనలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొద‌టి నుండి దండ‌యాత్ర‌నే చేశారు. సింగిల్స్‌,టూస్ కాకుండా బౌండ‌రీల‌తోనే ఎక్కువ‌గా ప‌రుగులు రాబ‌ట్టారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీ చేశాడు. హెడ్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 8 సిక్స్ లు ఉన్నాయి. ఇక మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శర్మ కూడా ధ‌నాధన్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. 28 బంతుల్లోనే 75 పరుగులు చేసిన అభిషేక్ ఇందులో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు కొన్నాడు.

హెడ్, అభిషేక్ సునామి ఇన్నింగ్స్‌తో హైద‌రాబాద్ 5.4 ఓవర్లలోనే హైదరాబాద్ 100 పరుగులు దాటేసింది. ఆ తర్వాత కూడా వీరిద్దరు చెల‌రేగిపోయారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు భీక‌రమైన ఇన్నింగ్స్ ఆడుతూ ల‌క్నో బౌలర్స్‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఈ ఇద్దరూ అజేయంగా 58 బంతుల్లోనే 167 పరుగుల భాగస్వామ్యం న‌మోదు చేసి జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించారు. కేవలం 9.4 ఓవ‌ర్ల‌ల‌లోనే హైద‌రాబాద్ జ‌ట్టు ల‌క్ష్యాన్ని చేధించి స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సీజ‌న్‌లోనే హైద‌రాబాద్ 287 ప‌రుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు సెట్ చేసింది. ఇక ఐపీఎల్‍లో 160 పరుగులకుపైగా లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే ఛేదించిన తొలి జట్టుగా హైద‌రాబాద్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్ న‌మోదైంది. ఇక ఈ విజ‌యంతో హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్‌కి మ‌రింత చేరువైంది.

RELATED ARTICLES

తాజా వార్తలు