SRH vs GT| ఈ సారి ప్లే ఆఫ్స్ కోసం చాలా జట్లు పోటీ పడుతుండడం మనం చూశాం. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరుకోగా, మూడు, నాలుగు స్థానాలలోకి ఏయే జట్లు చేరతాయా అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే రాత్రి మ్యాచ్‌కి ముందు సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే కొన్ని జీటీ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి. 12 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్లతో జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కి చేరుకోవాలని భావించింది. కాని గత రాత్రి ఉప్పల్ స్టేడియంలో ఎడతెరపి లేని వర్షం కారణంగా సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. దీంతో సన్ రైజర్స్ 13 మ్యాచ్ లతో 15 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది.
ఇక నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం ఆర్సీబీ, సీఎస్కే తలపడనుండగా, ఎవరు గెలిస్తే వారు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశం ఉంది. గుజరాత్ జట్టు 14 మ్యాచుల్లో 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో రెండు జట్లు 1-1 పాయింట్లు పంచుకున్నాయి. అప్పుడే GT ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ప్లే ఆఫ్ రేసులో ఉన్న జట్టలో ఒక్క జట్టుకి మాత్రమే 15కి మించి పాయింట్స్ సాధించే అవకాశం ఉండడంతో సన్‌రైజర్స్ డైరెక్ట్‌గా ప్లే ఆఫ్ చేరుకుంది.
ఇక శుక్రవారం (మే 17) ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగగా, ఈ మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్ అని చెప్పాలి. శనివారం (మే 18) సీఎస్కే, ఆర్సీబీ మధ్య వర్చువల్ ఎలిమినేటర్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ధోనికి ఇది చివరి ఐపీఎల్ కాబట్టి ఆ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్లి కప్ కొట్టాలని చెన్నై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరోవైపు విరాట్ అభిమానులు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్లి ఈ సీజన్ విజేతగా అయితే బాగుంటుందని కలలు కంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో మరి..!