SRH vs RCB| ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ఓడారు అంటే ఇక ప్లే ఆఫ్స్‌కి లేనట్టే. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, పటిదార్ విధ్వంసం సృష్టించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రజత్ పాటిదార్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుండి విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి.
కేవలం 19 బంతుల్లోనే 5 సిక్సులు, 2 ఫోర్లతో హైదరాబాద్ స్టేడియంలో పరుగుల సునామి సృష్టించాడు. అయితే, అర్ధ సెంచరీ పూర్తి అయిన వెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ఇక విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్స్, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ బ్యాట్స్‌మెన్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్స్, ఒక సిక్సర్ ఉన్నాయి. డుప్లెసిస్, కోహ్లీ ఉన్నంత సేపు స్కోరు బోర్డ్ పరుగులు పెట్టింది. ఎప్పుడైతే డుప్లెసిస్ ఔటయ్యాడో అప్పుడు పటిదార్ వచ్చి విధ్వంసం సృష్టించాడు. పటిదార్ ఔటైన తర్వాత స్కోరు బోర్డ్ వేగం తగ్గంది. గ్రీన్ కాస్ విలువైన పరుగులు చేశాడు. 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
ఇక ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ 6 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఇక దినేష్ కార్తీక్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. 6 బంతులు ఆడి కేవలం పదకొండు పరుగులే చేశాడు.మొత్తానికి ఆర్సీబీ 20 ఓవర్లకి గాను 7 వికెట్స్ కోల్పోయి 206 పరుగులు చేశారు. ఇక ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్‌లో ఉనద్కత్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్స్ తీసాడు. నటరాజన్ 2, కమ్మిన్స్, మయాంక్ తలా వికెట్ తీసుకున్నారు. ఇక ఎస్ఆర్ హెచ్ టార్గెట్ 120 బంతుల్లో 207 పరుగులు చేయాలి. ఈ సీజన్‌లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 400 ప్లస్ రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్‌గానూ 4000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.