IPL 2024| హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2024కి మరి కొద్ది రోజులలో ఎండ్ కార్డ్ పడనుంది. కేవలం ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. ఇప్పటికే క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) నేరుగా ఫైనల్ చేరింది. ఇక వారితో ఫైనల్‌లో ఎవరు తలపడతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. ఫైనల్ చేరుకోవాలి అంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోవల్సిన పరిస్థితి నెలకొంది.ఈ రెండు జట్లలో గెలిచిన వారు ఆదివారం జరిగే పైనల్‌లో కేకేఆర్‌తో తలపడనున్నారు. అయితే ఆర్ఆర్, హైదరాబాద్ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది.
ప్రస్తుతం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంతో పాటు 7 జిల్లాలకు వాతావరణ వలన వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు చెన్నై వేదికగానే క్వాలిఫయర్2తో పాటు ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. మరి ఈ రెండు మ్యాచ్‌లకి వర్షం ముప్పు ఉండడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం వలన జరగకపోతే రిజర్వ్ డేగా మరుసటి రోజు ఆడిస్తారు.
రిజర్వ్ డే కూడా వర్షం పడి మ్యాచ్ జరగకపోతే, పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ లెక్కన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కి వెళ్లి .. కేకేఆర్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఒక వేళ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే.. రిజర్వ్ డే రోజు మ్యాచ్ ఆడించే అవకాశం ఉంటుంది. ఆ రోజు కూడా వర్షం వలన ఆట సాధ్యం కాకపోతే టేబుల్ టాప్‌లో ఉన్న కేకేఆర్‌ని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇంత వరకు ఐపీఎల్ చరిత్రలో వర్షం వలన ఏ ఫైనల్ మ్యాచ్ రద్దైంది లేదు. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి