Sunday, December 29, 2024
HomeTelanganaSrikanth Chary | కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకాంతాచారి త‌ల్లి..

Srikanth Chary | కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకాంతాచారి త‌ల్లి..

హైద‌రాబాద్ : తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి (Srikanth Chary) తల్లి శంకరమ్మ కారు దిగారు. గురువారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపా దాస్ దీపా మున్షి స‌మ‌క్షంలో శంక‌ర‌మ్మ (Shankaramma) కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా శంక‌ర‌మ్మ మాట్లాడుతూ.. ఇవాళ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. బీఆర్ఎస్ పార్టీలో త‌న‌కు గుర్తింపు లేదు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి త్యాగం చేశాడు. అమ‌ర‌వీరుల త్యాగాల‌ను చూసిన త‌ర్వాత సోనియాగాంధీ రాష్ట్రం ప్ర‌క‌టించారు. అమ‌ర‌వీరుల కుటుంబాలు సోనియ‌మ్మ రుణం తీర్చుకోవాల‌నుకున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో సుఖసంతోషాల‌తో ఉన్నారంటే సోనియా పుణ్య‌మే అని శంక‌ర‌మ్మ పేర్కొన్నారు. ఇక శంక‌ర‌మ్మ‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో స‌రైన గుర్తింపు ఇస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఈ ఏడాది జన‌వ‌రి తొలి వారంలో సీఎం రేవంత్ రెడ్డిని శంక‌ర‌మ్మ క‌లిసిన సంగ‌తి తెలిసిందే. దీంతో శంకరమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. మొత్తానికి ఆమె ఇవాళ హ‌స్తం పార్టీలో చేరారు.

ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మ హుజూర్‌నగర్‌ నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నిక ఉత్తమ్ రాజీనామాతో ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో శంకరమ్మను పక్కకు పెట్టి ఎన్‌ఆర్ఐ సైదిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ను పలుమార్లు కోరారు. వివిధ వేదికలపై తనతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని శంకరమ్మ బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ దగ్గరకు తీసినా.. పదవి ఇవ్వలేదు. దీంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమెను చట్టసభలకు పంపి.. అమరుల పక్షాన నిలిచేది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు