Srikanth | బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీపై బెంగుళూరు పోలీసులు ఆకస్మిక దాడి చేయడంతో అక్కడ దాదాపు వంద మంది ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్టీలో తెలుగు పరిశ్రమకి చెందిన నటీనటులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. నటి హేమ ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఆమె పోలీసులకి కూడా దొరికిందని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు శ్రీకాంత్ పేరును కూడా సామజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో, ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలదేని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేసి విడుదల చేశారు.
నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాలు చాలామంది నాకు ఫోన్స్ చేశారు. అయితే కొన్ని వీడియో క్లిప్స్ కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. అప్పుడేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు.
ఇలాంటి వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను. దయచేసి ఎవరూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా, చాలామంది సామాజిక మాధ్యమాల్లో ‘రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్’ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు’’ అని శ్రీకాంత్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.