హైదరాబాద్: తెలంగాణ టెట్ (TS TET) పరీక్ష తేదీలను పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర అవతరణ దినోత్సం రోజున పరీక్ష నిర్వహించడంపై తెలంగాణ వాదులు, నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయంలో ఇలానే చేస్తున్నదని విమర్శిస్తున్నారు.
మొన్న అంబేద్కర్ జన్మదినం సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించక పోగా.. కనీసం అలంకరను నోచుకోని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అదేవిధంగా గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరుల స్థూపం వద్దకు కాంగ్రెస్ నాయకులు చెప్పులేసుకొని వెళ్లి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక సెలవు దినం కావడంతోపాటు రాష్ట్రం మొత్తం వేడుకలు జరుపునే జూన్ 2న పరీక్షను ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించిన అధికారులకు కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
కాగా, టెట్ పరీక్షను ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..
మే 20 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 20 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 21 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 21 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 22 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 22 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 24 – పేపర్ 2 సోషల్ స్టడీస్(మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
మే 24 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 28 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
మే 28 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 29 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
మే 29 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 30 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
మే 30 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)
మే 31 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
మే 31 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)
జూన్ 1 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
జూన్ 1 – పేపర్ 1(మైనర్ మీడియం) (సెషన్ – ఎస్2)
జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)