Suchitra| ఒకప్పుడు సుచీ లీక్స్ అంటూ ఇండస్ట్రీలో సంచలనం రేపిన సుచిత్ర ఇప్పుడు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రకంపనలు పుట్టిస్తుంది. ధనుష్, ఐశ్వర్య విడాకుల గురించి మాట్లాడింది. అలానే అతడిని గే అంది. తన భర్తని సైతం గే అంటూ కామెంట్ చేసింది. ఇక త్రిష మీద కూడా కామెంట్స్ చేసింది. సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని తెలిపింది. అమలాపాల్, త్రిషలతో ధనుష్ ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన ధనుష్ నుండి ఐశ్వర్య విడిపోయిందని కోలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారంటూ తెలిపింది. అయితే ఆమె ఇలా వ్యాఖ్యలు చేస్తుండడంతో సుచిత్ర భర్త ఆమె మానసిక స్థితి బాలేదని.. అందుకే పిచ్చి వాగుడు వాగుతుందని, అవి పట్టించుకోనవసరం లేదని కామెంట్ చేశాడు.
అయితే ధనుష్, జీవీ ప్రకాష్ కుమార్ , త్రిష ఇలా పలువురు ప్రముఖులని టార్గెట్ చేస్తూ వచ్చిన సుచిత్ర ఇప్పుడు కమల్ హాసన్‌ని కూడా టార్గెట్ చేస్తూ ఆయన ఒక ట్రాన్స్‌జెండర్ అని, అందుకే అలాంట బట్టలు ధరిస్తాడని సుచిత్ర ఓ ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. కమల్ హాసన్, మాయ ట్రాన్స్ జెండర్స్ అయి ఉంటారు. అందుకే ఆయనకు చుడీదార్, కుర్తా వంటివి వేసుకుంటారు. ఆయనకి అవంటేనే ఇష్టమంటూ కామెంట్ చేసింది. వీటిపై మేము రీసెర్చ్ చేయడం వల్లనే చెబుతున్నామని ఆమె తెలియజేసింది. విశ్వరూపం సినిమా చూస్తే.. అందులో ఆయన క్లాసికల్ డాన్స్ నేర్పించే క్రమంలో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్ మాదిరిగానే ఉంటాయని తెలియజేసింది.
ఇక అందులో ఆయన వైట్ డ్రెస్ వేసుకుంటారు. అలానే డీదార్ లాంటి డ్రెస్ వేసుకొని కనిపిస్తారు. ఇక బయట కూడా చూడండి ఆయన ఎక్కువగా ఇలాంటి బట్టలే వేసుకొని కనిపిస్తూ ఉంటారు అని సుచిత్ర పేర్కొంది. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కమల్ హసన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతుండగా, కమల్ తరపున ఎవరైన స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.