Saturday, January 4, 2025
HomeCinemaSudigali Sudheer| సుధీర్ మరీ ఇంత ర‌సికుడా.. దెయ్యంతో అయిన ఓకేన‌ట‌..!

Sudigali Sudheer| సుధీర్ మరీ ఇంత ర‌సికుడా.. దెయ్యంతో అయిన ఓకేన‌ట‌..!

Sudigali Sudheer| సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు హీరోగా కూడా స‌త్తా చాటుతున్నాడు. సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ షోలో ప్లేబాయ్‌ క్యారెక్టర్‌తో ఎంత కామెడీ చేసాడో మ‌నం చూశాం. అమ్మాయిల‌ని ప‌డేసాలా డైలాగులు చెబుతూ, ఆడ‌వాళ్లంటే పిచ్చి అనేలా న‌టిస్తూ అందరిని ఎంత‌గానో అల‌రిస్తుంటాడు. దాదాపు తొమ్మిదేళ్ల‌పాటు జ‌బ‌ర్ధ‌స్త్‌లో త‌న హ‌వా చూపించాడు. ముఖ్యంగా ర‌ష్మీతో మ‌నోడు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. తెగ పులిహోర క‌లుపుతూ ర‌చ్చ చేస్తుంటాడు. స్టేజ్‌పైనే ర‌ష్మీతో నానా ర‌చ్ చేస్తూ వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ న‌డుస్తుంది అనేలా చేసేవాడు.

ర‌ష్మీ, సుధీర్ గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగిన వారిద్ద‌రు మాత్రం తాము ఫ్రెండ్స్ అని మాత్ర‌మే చెప్పేవారు. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత ర‌ష్మీతో కలిసి సుధీర్ పెద్ద‌గా క‌నిపించింది లేదు. అయితే మ‌నోడు సినిమాల‌తో ఇటీవ‌ల బిజీగా మారాడు. అయితే అంత బిజీ షెడ్యూల్స్‌లో కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ హోస్ట్ గా సర్కార్ 4 అనే షో న‌డుస్తుంది. ఈ గేమ్ షోను మూడు సీజన్స్ వరకు ప్రదీప్ ఎంతో అద్భుతంగా నడిపించ‌గా, ఇక నాలుగో సీజన్ బాధ్యతలు సుధీర్ తీసుకున్నాడు. సుధీర్ ఉన్న చోట ఎంటర్ టైన్మెంట్ కు లోటే ఉండ‌దు కాబ‌ట్టి మేనేజ్‌మెంట్ కూడా ఆయ‌న‌ని నమ్మి ఈ షోని అత‌నికి అప్ప‌గించారు. వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌డం లేదు సుధీర్.

ప్ర‌తి ఎపిసోడ్ లో కూడా వచ్చిన సెలబ్రిటీలను తనదైన కామెడీతో నవ్విస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా సర్కార్ 4 కొత్త ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయ‌గా, ఇందులో ల‌వ్ మీ టీమ్ సంద‌డి చేసింది. హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య, రవి క్రిష్ణ, సిమ్రాన్ చౌదరి షోలో పాల్గొని వినోదం పంచే ప్ర‌య‌త్నం చేశారు.ఈ సినిమాలో దెయ్యంతో ప్రేమ అనగానే దెయ్యంతో కూడా నాకు ఓకే అని చెప్పి అంద‌రిని న‌వ్వించాడు. దెయ్యం తో కూడా పులిహోర కలుపుతూ.. సర్ ఈ నైట్ కు రమ్మని చెప్పండి అంటూ సుధీర్ అన‌డం అంద‌రికి న‌వ్వు తెప్పిస్తుంది. ఇక బిగ్ బాస్ ఫేమ్ ర‌వికృష్ణ‌తో ఓ ఆట ఆడుకున్నాడు సుధీర్. ప్ర‌స్తుతం ఈ ప్రోమో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు