Sunday, December 29, 2024
HomeEducationSundar Pichai: సక్సెస్‌ మంత్ర 10: సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: సక్సెస్‌ మంత్ర 10: సుందర్‌ పిచాయ్‌

ఈ 10 సూత్రాలు పాటిస్తే ఏ రంగంలోనైనా దూసుకెళ్లొచ్చు

 

సాంకేతిక రంగంలో సుందర్‌ పిచాయ్‌ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆల్ఫాబెట్‌, గూగుల్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. దార్శనికత కలిగిన నాయకుడు. అణకువతోపాటు పట్టుదల కలిగిన సుందర్‌.. సృజనాత్మకంగా ఆలోచిస్తాడు.

సాంకేతిక రంగంలో సుందర్‌ పిచాయ్‌ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆల్ఫాబెట్‌, గూగుల్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. దార్శనికత కలిగిన నాయకుడు. అణకువతోపాటు పట్టుదల కలిగిన సుందర్‌.. సృజనాత్మకంగా ఆలోచిస్తాడు. భారతదేశంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన పిచాయ్‌ చదువులో పటిష్ఠమైన పునాది, సాంకేతిక రంగంపై ఉత్సుకత కారణంగా సాంకేతిక దిగ్గజం గూగుల్‌కు బాస్‌ కాగలిగారు. ఏ రంగంలోనైనా రాణించడానికి ఆయన కార్పొరేట్‌ ప్రస్థానం నుంచి మనం పది సూత్రాలు నేర్చుకోవాలి.

ఏ రంగంలోనైనా ఎదగాలంటే దాని గురించి బాగా ఉత్సుకత కలిగి ఉండాలి. సుందర్‌ పిచాయ్‌కు సాంకేతికత అంటే ఎంతో ఇష్టం. అదే ఆయనను గూగుల్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా చేసింది. కాబట్టి, ఏ అంశంపైన అయినాసరే ప్రశ్నలు అడగాలి. పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవాలి.

మూలాలు మరవొద్దు

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దు. ఎదుటివాళ్లు ఎవరైనా సరే వాళ్లను గౌరవించడం మన విధి. సుందర్‌ పిచాయ్‌ భారీ విజయాలు సాధించినప్పటికీ ఎంతో అణకువగా ఉంటారు.

కష్టం ఫలిస్తుంది

గూగుల్‌కు పెద్దతనం అంటే సుందర్‌ పిచాయ్‌ శ్రమించే తత్వం, సహనానికి కార్పొరేట్‌ ప్రపంచంలో దక్కిన గుర్తింపు. విజయం రాత్రికి రాత్రే సిద్ధించదు. నిరంతరం సహనంతో పరిశ్రమించాలి.

చదువును తక్కువగా చూడొద్దు

ఇంజినీరింగ్‌, బిజినెస్‌లో సుందర్‌ పిచాయ్‌కు ఉన్న బలమైన నేపథ్యం కెరీర్‌లో అతని ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడింది. చదువు మనకు అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. విమర్శనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలను పెంపొందిస్తుంది. అందుకే చదువును నిర్లక్ష్యం చేయకూడదు.

ఆలోచనలు భారీగా

పిచాయ్‌ నాయకత్వంలో గూగుల్‌ సంస్థ కృత్రిమ మేధ, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, డ్రీమ్‌ బిగ్‌లాంటి ప్రతిష్ఠాత్మక
ప్రాజెక్టులు చేపట్టింది. భారీ లక్ష్యాలకు భయపడకపోతేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టగలరు. అందువల్ల గొప్ప కలలు కనాలి. గొప్పగా పనిచేయాలి.

తిరిగి ఇవ్వాలి

మనం సాధించే విజయాలు ప్రపంచం మీద సానుకూల ప్రభావం చూపాలి. మన సంపదను పదిమంది మంచికి ఉపయోగించాలి. సుందర్‌ పిచాయ్‌ కూడా విద్య సాంకేతిక రంగాల్లో వసతుల కల్పనకు చొరవ చూపించారు.

బృందంగా పనిచేయడం

సుందర్‌ పిచాయ్‌కు జట్టుగా కలిసికట్టుగా పనిచేయడం విలువ తెలుసు. కాబట్టే, గూగుల్‌ లాంటి సంస్థలో బలమైన, ఒకరికొకరు సహకారం చేసుకునే బృందాలను ఏర్పాటు చేయగలిగాడు. ఇతరులతో కలిసి పనిచేయడం పనిలో
వైవిధ్యానికి చోటిస్తుంది.

మార్పును ఆహ్వానించాలి

సాంకేతిక ప్రపంచంలో మార్పులు వేగంగా వస్తుంటాయి. పిచాయ్‌ ఎప్పటికప్పుడు తనను తాను అప్‌డేట్‌ చేసుకుంటారు. అదే ఆయన విజయ రహస్యం. మనం కూడా ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా మారాలి.

పరిస్థితి శాసించవద్దు

సుందర్‌ పిచాయ్‌ది సానుకూల దృక్పథం. అది సవాళ్లను ఎదుర్కోవడానికి, తన చుట్టూ ఉన్నవారిలో స్ఫూర్తి నింపడానికి బాగా పనికివచ్చింది. కఠినమైన పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథాన్ని విడిచిపెట్టకూడదు. పరిస్థితులు మిమ్మల్ని శాసించకుండా.. మీరే పరిస్థితులను శాసించగలగాలి.

పట్టు విడవ కూడదు

ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో సవాళ్లను దాటాల్సి ఉంటుంది. వాటిని పట్టుదలతో అధిగమించాలి. సుందర్‌ పిచాయ్‌ కార్పొరేట్‌ జీవితం కూడా సవాళ్లతో కూడిందే. ఆయన వాటిని ఓర్పుతో అధిగమించి గూగుల్‌ బాస్‌గా ఎదిగారు.

RELATED ARTICLES

తాజా వార్తలు