Wednesday, January 1, 2025
HomeInternationalSunset | అంతరిక్షం నుంచి సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసా..!

Sunset | అంతరిక్షం నుంచి సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసా..!

Sunset | సూర్యోదయం, సూర్యాస్తమయం చూపరులకు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. అయితే, అందరికీ భూమిమీద నుంచే సూర్యాస్తమయాన్ని మనం చూసి ఉంటాం. అయితే, అంతరిక్షం నుంచి సూర్యాస్తమయం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి తీసిన ఫొటోలను విడుదల చేసింది. సూర్యుడు అస్తమయాన్ని ఐఎస్ఎస్‌లో ఉన్న ఓ వ్యోమగామి ఫొటోలను క్లిక్‌ మనిపించాడు. ఈ ఫొటోలను అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.

భూమి, ఆకాశం నల్లగా ఉండి.. భూమి నుంచి కిందికిపోతూ సగం మేర కనిపిస్తున్న సూర్యాస్తమయం అందరినీ ఆకట్టుకుంటున్నది. సూర్యుడి కిరణాలతో ఎగువన నీలి రంగులో.. మధ్యలో తెల్లగా.. దిగువన నారింజ రంగులో కనిపించింది. అయితే, ఇది సూర్యాస్తమయం కాదని నాసా తెలిపింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున ఐఎస్ఎస్ వేగంగా తిరుగుతూ ఉంటుంది. అది రోజుకు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. దాంతో 16సార్లు వ్యోమగాములకు సూర్యోదయం, సూర్యాస్తమయాలు కనిపిస్తాయి. వీటిని ఆర్బిటల్ సన్‌రైజ్, ఆర్బిటల్ సన్‌సెట్‌గా పిలుస్తారని నాసా పేర్కొంది. అలా ఓసారి సూర్యాస్తమయం అవుతుందగా ఈ ఫొటో తీసినట్లు వివరించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు