Monday, December 30, 2024
HomeNationalSupreme Court | అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’..

Supreme Court | అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’..

Supreme Court | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది. ఢిల్లీ మద్యం పాల కేసులో ఆయన అరెస్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేయడాన్ని, రిమాండ్‌ను ఆయన పిటిషన్‌లో సవాల్‌ చేశారు. అయితే, సాధారణ బెయిల్‌ కోసం కింది కోర్టును ఆశ్రయించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్త తమ నిర్ణయాన్ని రిజర్వ్‌ చేశారు. కేజ్రీవాల్‌ తరఫున సింఘ్వీ కోర్టుకు హాజరయ్యారు. ఈంతో పాటు ఈడీ తరఫున ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.

వాదనలు విన్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తీర్పును రిర్వజ్‌ చేసినట్లు పేర్కొంది. పిటిషన్‌ చట్టం ప్రకారం బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించవచ్చని.. అక్టోబర్‌ 30, 2023 తర్వాత నమోదు చేసిన కేసు ఫైల్‌, సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అదే రోజు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా బెయిల్‌ను తిరస్కరించిన విషయం విధితమే. మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 20న అరెస్టు చేసింది. ఈ కేసులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఆయనకు మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్‌ 2న మళ్లీ జైలులో లొంగిపోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ఈ మనీలాండరింగ్ కేసు 2021-22కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో అవినీతి నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. అయితే, ఆ మద్యంపాలసీపై విమర్శలు రావడంతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు