Sunday, December 29, 2024
HomeTelanganaMLC Dande Vital | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠ‌ల్‌కు ఊర‌ట‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీం...

MLC Dande Vital | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠ‌ల్‌కు ఊర‌ట‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

MLC Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్​కు (MLC Dande Vital) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ ఉన్న‌త న్యాయ‌స్థానం స్టే విధించింది. పిటిషన్​పై తదుపరి విచారణ జులై నెలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా విఠల్​ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

2022లో ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నికయ్యారు. అయితే, తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు నామినేషన్ డాక్యుమెంట్లను కేంద్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరికీ పంపించాలని విన్నవించారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం, విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.

2021 నవంబరు 16న ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్ వెలువ‌రించింది. అదే నెల 23 వరకు నామపత్రాలను స్వీకరించింది. బీఆర్​ఎస్ పార్టీ అభ్యర్థిగా దండె విఠల్‌, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, పెందూర్‌ పుష్పరాణి సహా 30 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు