Supritha|క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రిత ఇటీవలి కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఒక్క సినిమా చేయకపోయిన కూడా సోషల్ మీడియా ద్వారానో లేదంటే ఇతర విషయాలతోనో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుప్రిత ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్‌తో కలిసి ఓ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉంది. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అమ్మడి ఫేమ్ మరింత పెరగనుందని అంటున్నారు. అయితే సుప్రిత ఇటీవల తన వివాహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. మొన్నామధ్య స్టార్ సింగర్ శ్రీరామచంద్రని ఇష్టపడుతున్నట్టు తెలిపింది. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్స్ సుప్రితని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఓ నెటిజన్.. .. ‘నువ్వు టాలీవుడ్‌లో ఏ పెళ్లి కాని హీరోను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. దానికి సమాధానం ఇచ్చిన సుప్రిత.. విజయ్ దేవరకొండ ఫొటో ని మరీ షేర్ చేస్తూ అతడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపింది. చూస్తుంటే ఈ అమ్మడు రచ్చ మాములుగా లేదుగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజంగా సుప్రితకి విజయ్ దేవరకొండపై అంత క్రష్ ఉందా అని ముచ్చటించుకుంటున్నారు.
ఇక సుప్రిత విషయానికి వస్తే.. సినీ జంట సురేష్ తేజ – సురేఖ వాణి కూతురిగా చిన్న వయస్సులోనే తన టాలెంట్‌తో ప్రపంచానికి పరిచయం అయింది. యూట్యూబర్‌గా ఎనలేని క్రేజ్ దక్కించుకుంది. ఇక తన అందచందాలతోను తెగ మెప్పిస్తూ ఉంటుంది. 2019లో సుప్రిత ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్ చేయగా, ఇందులో తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసి ఫేమస్ అయింది. ఇటీవలి కాలంలో తల్లితో కలిసి తెగ రీల్స్ చేస్తూ హాట్ టాపిక్ అయింది.