T-20 world cup ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా
ట్రినిడాడ్ లో జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ సెమిఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్ లలో 56 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 8.5 ఓవర్ లలోనే ఛేదించింది. హెన్రిక్స్ 29(25), మార్క్రమ్ 23(21) పరుగులతో రాణించారు.
ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా పురుషుల టి-20 వరల్డ్ కప్ లో మొదటిసారిగా ఫైనల్ కు చేరింది.