T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. ప్రపంచ నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా
T20 Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ హార్దిక్ ప్యాండ్యా ప్రపంచ నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచిన పాండ్యా.. రెండు స్థానాలు మెరుగుపరుచుకొన్నాడు. వరల్డ్ కప్‌లో ఆటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో ఆకట్టుకోగా.. అదే సమయంలో జట్టుకు అవసరమైన సమయంలో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 150 కంటే ఎక్కువ స్ట్రయిక్ రేట్‌తో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్ల తీశాడు. కీలమైన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌తో పాటు రబాడా వికెట్లు తీసి మ్యాచ్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను నెగ్గేందుకు సహకారం అందించాడు.